ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు రద్దు(IND Vs ENG 5th Test Called Off) కావడంపై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli On Manchester Test) తొలిసారి స్పందించాడు. కరోనా వల్ల ఏర్పడిన అనిశ్చితి ఇందకు కారణమని అన్నాడు. ఇది చాలా దురదృష్టమని తెలిపాడు.
"దురదృష్టవశాత్తు ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు ఆడకుండానే ఇక్కడికి రావాల్సివచ్చింది. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్‌లోనైనా బలమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పాటవుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్లో ఇప్పుడు మేం ఆడబోతున్నది చాలా కీలకం. ఆర్సీబీ జట్టుతో పాటు టీ20 ప్రపంచకప్‌కు కావాల్సిన భారత ఆటగాళ్లకు ఇదెంతో ముఖ్యం".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ రెండోదశలో(IPL 2021 2nd Leg) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తమ మొదటి మ్యాచ్‌ను సోమవారం(సెప్టెంబరు 20) ఆడనుంది.
ఐపీఎల్ రెండోదశలో ఆర్సీబీ జట్టులో కొన్ని మార్పులు(RCB Team Changes) జరుగుతాయని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. లెగ్-స్పిన్నర్ వానిందు హసరంగ, సింగపూర్‌కు చెందిన బ్యాట్స్‌మన్ టిమ్ డేవిడ్ జట్టులోకి చేరుతారని చెప్పాడు. జట్టులో కొన్ని మార్పులు జరగనున్నాయని.. ఆ మార్పులతో జట్టు మరింత ఫిట్‌గా మారుతుందని భావిస్తున్నట్లు కోహ్లీ(RCB Captain) పేర్కొన్నాడు.
ఇదీ చూడండి.. భారత ఆటగాళ్లకు పాకిస్థాన్‌లో ఘనమైన ఆతిథ్యం