ETV Bharat / sports

IND vs ENG: నాలుగో టెస్టుకు స్టార్ ఆల్ రౌండర్ దూరం? - ఓవల్​ టెస్టు

భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు టీమ్​ఇండియా స్టార్​ ఆల్​రౌండర్​ దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకురావాలని జట్టు భావిస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు.

india vs england 4th test
నాలుగో టెస్టుకు స్టార్ ఆల్ రౌండర్ దూరం?
author img

By

Published : Aug 29, 2021, 1:33 PM IST

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు(Ind Eng Test) ముందు టీమ్​ఇండియా అభిమానులకు చేదు వార్త! మూడో టెస్టు రెండో రోజున ఫీల్డింగ్​ చేస్తుండగా గాయపడిన స్టార్​ ఆల్​రౌండర్ రవీంద్ర​ జడేజా.. ఇప్పుడు నాలుగో టెస్టుకు (ind vs eng) దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జడేజాను.. మోకాలి గాయానికి సంబంధించి పరీక్షలు నిర్వహించేందుకు లీడ్స్​లోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని జడ్డూ తన ఇన్​స్టాలో షేర్​ చేశాడు. ఇది నేను ఉండాల్సిన చోటు కాదని పేర్కొన్నాడు.

india vs england 4th test
జడేజా ఇన్​స్టా స్టోరీ

జడ్డూకు అయిన గాయం తీవ్రం కాదని జట్టు భావిస్తోంది. ఆగస్టు 30న టీమ్​ ఇండియా లండన్​కు బయలుదేరాల్సి ఉంది. ఈలోగా గాయం తీవ్రం కాదని డాక్టర్లు స్పష్టం చేస్తే.. జడ్డూ లండన్​ టెస్టులో ఆడతాడు. ఒకవేళ జడ్డూ గాయం తీవ్రం అయితే అతడి స్థానంలో సీనియర్​ ఆఫ్​ స్పిన్నర్​ అశ్విన్​ వచ్చే అవకాశం ఉంది.

ఓవల్​ వేదికగా సెప్టెంబరు 2 నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి : PR Sreejesh: శ్రీజేష్‌.. మన 'కంచు' కోట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.