ETV Bharat / sports

'మొతేరాను చూసి గర్వపడుతున్నా' - ఇండియా vs ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతేరాను బుధవారం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరన్​ రిజిజు స్టేడియాన్ని సందర్శించారు. ప్రపంచస్థాయి సదుపాయాలను ఆయన పరిశీలించారు.

Motera not only largest, but one of the best stadiums in world: Rijiju
'మొతేరా స్టేడియం అతిపెద్దది.. ఉత్తమమైనది'
author img

By

Published : Feb 24, 2021, 11:18 AM IST

'మొతేరా'.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమే కాకుండా.. ఉత్తమమైనదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరన్​ రిజిజు అన్నారు. అహ్మదాబాద్​లో ఉన్న ఈ మైదానాన్ని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రారంభించనున్న నేపథ్యంలో క్రీడామంత్రి సందర్శించారు. స్టేడియంలోని ప్రపంచస్థాయి సౌకర్యాలను పరిశీలించారు.

"నేను మొతేరా స్టేడియాన్ని చూడటానికి వెళ్లాను. దాని డిజైన్​, నిర్మాణానాన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రయత్నించా. మొతేరా స్టేడియం ప్రపంచంలో అతిపెద్దదే కాదు.. ఉత్తమమైన స్టేడియాల్లో ఇదొకటని నేను చెప్పగలను. ప్రేక్షకులకు, ఆటగాళ్లకు విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి స్టేడియం ఒకటి ఉందని నేను చాలా గర్వపడుతున్నా. ఈ స్టేడియం కాన్సెప్ట్​ చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ తర్వాత దాన్ని రెండున్నర ఏళ్లలో పూర్తి చేసిన హోంమంత్రి అమిత్​షాకు ధన్యవాదాలు."

- కిరన్​ రిజిజు, కేంద్ర క్రీడామంత్రి

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా నిలిచిన మొతేరాలో దాదాపుగా ఒక లక్ష 32 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్​ను వీక్షించే సామర్థ్యాన్ని కలిగిఉంది. సాధారణంగా క్రికెట్​ స్టేడియాలను రౌండ్​ ఆకారంలో నిర్మిస్తారు. కానీ, ఈ మొతేరా మైదానాన్ని మాత్రం ఓవల్​ (గుడ్డు) ఆకారంలో నిర్మించారు.

ఇదీ చూడండి: మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.