ETV Bharat / sports

పీటర్సన్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన జాఫర్​

ట్విట్టర్​ వేదికగా ఇంగ్లండ్​, ఇండియా మాజీ ఆటగాళ్ల మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. తాజాగా ముగిసిన రెండో టెస్టులో భారత్​ విజయం సాధించగా.. దీనిపై ఇంగ్లండ్​ ఆటగాడు కెవిన్ పీటర్సన్​ టీమ్​ఇండియాకు వ్యంగ్యంగా శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై జాఫర్​ అతనికి అదిరిపోయే పంచ్​ ఇచ్చాడు.

kevin pietersen tries to troll india after epic chennai win gets roasted by jaffer
పీటర్సన్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన జాఫర్​
author img

By

Published : Feb 16, 2021, 10:37 PM IST

గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడటం సాధారణమే. కానీ ప్రస్తుతం పోటీ కాస్త భిన్నంగా మారింది. ఆటగాళ్లతో పాటు మాజీలూ విజయం కోసం తలపడుతున్నారు. అయితే మాజీలు పోరాడేది మాత్రం నెట్టింట్లో. తమ జట్టుకు మద్దతుగా నిలుస్తూ, క్రికెట్ అభిమానులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. దీన్ని నెటిజన్లు కూడా ఎంతో ఆస్వాదిస్తున్నారు.

భారత మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వసీమ్‌ జాఫర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా హాస్య చతురతతో పోస్ట్‌లు చేస్తుంటారు. ఇక మైకేల్‌ వాన్‌, మైకేల్‌ క్లార్క్‌, రికీ పాంటింగ్‌ ప్రత్యర్థి జట్టును తక్కువగా అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తర్వాత తమ అంచనా తప్పని గుర్తిస్తుంటారు. అయితే.. తాజాగా పీటర్సన్‌, జాఫర్‌ మధ్య జరిగిన 'ట్విటర్ పోరు' నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో పీటర్సన్‌ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. "భారత్‌కు శుభాకాంక్షలు.. 'ఇంగ్లాండ్-బి' జట్టును ఓడించినందుకు" అని ట్వీటాడు. దీనికి జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

  • Don't troll KP guys. He's just trying to be funny. And I get it. I mean is it even a full strength England team if there are no players from SA?😉 #INDvsENG https://t.co/BhsYF1CUGm

    — Wasim Jaffer (@WasimJaffer14) February 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పీటర్సన్‌ను ట్రోల్ చేయకండి. అతడు సరదాగా ఇలా చేస్తున్నాడు. అయితే నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లాండ్ ఎలా పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు అవుతుంది?" అని జాఫర్‌ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా చెందిన పీటర్సన్‌ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్‌ అయ్యేలా పంచ్‌ విసిరిన జాఫర్‌ను కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సెమీస్​లోకి సెరెనా, జకోవిచ్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.