ఇంగ్లాండ్ జట్టుకు అవకాశాలు మూసుకుపోలేదని.. నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్ డ్రా చేసుకోవచ్చని ఆ జట్టు మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. తాజాగా ఓ ఆన్‌లైన్‌లో బ్లాగ్‌లో అతడీ విషయాలను పంచుకున్నాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులోనూ పిచ్‌లో పెద్దగా మార్పులుండవని చెప్పాడు. అయితే, మొతేరాలో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తి అయిన నేపథ్యంలోనే పీటర్సన్ ఆ వ్యాఖ్యలు చేశాడు.
"తర్వాతి మ్యాచ్(నాలుగో టెస్టు)లో పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని నేను అనుకోవట్లేదు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బాగా బ్యాటింగ్ చేస్తే.. పరిస్థితుల్ని ఆధీనంలోకి తెచ్చుకొనే అవకాశం ఉంది. భారత్‌లో వైఫల్యానికి ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మెన్‌ను నిందించలేం. ఎందుకంటే వారికిది తొలి పర్యటన. ఇదో అనుభవం వలే ఉంటుంది. ఇప్పటికే ఓడిపోయిన మ్యాచ్‌ల గురించి ఆందోళన చెందకుండా, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించడంపై ప్రశాంతంగా ఆలోచించాలి. ఇంతకన్నా బాగా ఆడాలేనా?మెరుగవ్వాలంటే ఇంకేం చేయాలనే విషయాలపై దృష్టిసారించాలి."
- కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్
అయితే, చెన్నైలో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 277 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యాక రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఆపై పింక్‌బాల్ టెస్టులోనూ పది వికెట్లతో ఘన విజయం సాధించి పర్యాటక జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ఆ జట్టు ఎలా ఆడనుందో వేచి చూడాలి. ఇక భారత్ ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా జూన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే ఆస్ట్రేలియా ఆ పోటీకి అర్హత సాధిస్తుంది.
ఇదీ చూడండి: కీలక పోరు కోసం భారత్-ఇంగ్లాండ్ సిద్ధం