అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టు రెండో రోజున కూడా టీమ్ఇండియా ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 24/1తో బరిలో దిగిన కోహ్లీసేన.. శుక్రవారం ఆటముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టుపై 89 రన్స్ ఆధిక్యంలో టీమ్ఇండియా కొనసాగుతోంది.
టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్ (60), అక్షర్ పటేల్ (11) బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు రిషభ్ పంత్ (101) అద్భుతమైన శతకంతో అలరించి.. అండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇదీ చూడండి: సొంతగడ్డపై మొదటి సెంచరీతో అదరగొట్టిన పంత్