ETV Bharat / sports

తొలి రోజు ముగిసిన ఆట- పటిష్ఠ స్థితిలో టీమ్​ ఇండియా

లార్డ్స్​ టెస్టులో టీమ్​ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. కేఎల్​ రాహుల్​ సెంచరీతో చెలరేగాడు. రోహిత్​ శర్మ 83 పరుగులు చేశాడు. పుజారా మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం రాహుల్​, రహానే క్రీజులో ఉన్నారు.

India vs England 2nd Test match updates
ఇంగ్లాండ్​, ఇండియా రెండో టెస్ట్​
author img

By

Published : Aug 12, 2021, 11:57 PM IST

ఇంగ్లాండ్​తో రెండో టెస్టులో టీమ్​ ఇండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. తొలి రోజు మొత్తం మనదే ఆధిపత్యం. ఆట ముగిసే సమయానికి భారత్​ 3 వికెట్లు నష్టానికి 276 పరుగులు చేసింది.

రోజంతా బౌలింగ్​ చేసిన ఇంగ్లాండ్​ 3 వికెట్లు మాత్రమే తీయగలిగింది. ఆతిథ్య జట్టులో అండర్సన్​ రెండు వికెట్లు తీశాడు. ఓలీ రాబిన్‌సన్ ఒక వికెట్​ తీశాడు.

రాహుల్​ సెంచరీ, రోహిత్​ అర్ధసెంచరీ..

ఇన్నింగ్స్​ మొత్తంలో ఓపెనర్లు రాహుల్​, రోహిత్​ ఆటే హైలెట్​. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్​ బౌలర్లకు పరీక్ష పెట్టారు. తొలి వికెట్​కు 126 పరుగులు జోడించారు.

India vs England 2nd Test match updates
రోహిత్ శర్మ

కేఎల్​ రాహుల్​ టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. రోహిత్​ 13వ అర్ధసెంచరీ చేశాడు.

మెల్లగా మొదలై..

అంతకుముందు టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్​.. కోహ్లీ సేనను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. వర్షం కారణంగా టాస్​కు 15 నిమిషాలు ఆలస్యమైంది. తొలుత ఆచితూచి ఆడింది భారత జోడీ. 9 ఓవర్లకు జట్టు స్కోరు 8/0. ఆ తర్వాత రోహిత్​ ఎడాపెడా బౌండరీలు బాదగా.. రాహుల్​ డిఫెన్స్​తో ఆకట్టుకున్నాడు.

అనంతరం.. 19వ ఓవర్లో మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో లంచ్​ బ్రేక్​ ప్రకటించారు. అప్పటికి భారత్​ స్కోరు 46/0.

రోహిత్​ దూకుడుతో.. ఈ క్రమంలోనే టెస్టుల్లో 13వ అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు​. ఆ తర్వాతా వేగం పెంచిన రోహిత్​(83).. ఇన్నింగ్స్​ 44వ ఓవర్లో అండర్సన్​ బౌలింగ్​లో బౌల్డయ్యాడు. 126 పరుగుల తొలి వికెట్​ భాగస్వామ్యానికి తెరపడింది.

రాహుల్​ షో..

రోహిత్​ అవుటయ్యాక రాహుల్​ జోరు పెంచాడు. పుజారా కాసేపు నిలకడగా ఆడినా.. 9 పరుగులకే పెవిలియన్​ చేరాడు. మూడో సెషన్​లో మళ్లీ భారత్​ ఆధిపత్యం కొనసాగింది. రాహుల్​కు జతకలిసిన సారథి కోహ్లీ(42).. 84 ఓవర్లో రాబిన్‌సన్ బౌలింగ్​లో రూట్​కు క్యాచ్​ ఇచ్చి పెవిలియన్​కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింకా రహానే నిలకడగా ఆడుతున్నాడు

India vs England 2nd Test match updates
సెంచరీ చేసిన సమయంలో బ్యాట్​ ఎత్తిన రాహుల్​

ఈ క్రమంలోనే సెంచరీ సాధించిన రాహుల్​.. 248 బంతుల్లో 127 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, ఒక సిక్స్​తో చెలరేగిపోయాడు.

ఓపెనర్లు రికార్డు..

లార్డ్స్​లో రోహిత్​-రాహుల్​దే అత్యుత్తమ ఓపెనింగ్​ భాగస్వామ్యం(126 పరుగులు).

2008లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్ట్రాస్‌, అలిస్టర్‌ కుక్ తొలి వికెట్‌కు జోడించిన 114 పరుగుల రికార్డును బ్రేక్​ చేశారు.

విదేశీ టీంలలో..

ఇంగ్లాండ్​లో పర్యటించిన ఓ జట్టు.. మొదటి ఇన్నింగ్స్​ ఓపెనింగ్​ భాగస్వామ్యం రికార్డులో రోహిత్​-రాహుల్​ జోడీ రెండో స్థానంలో ఉంది.

1993లో ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనింగ్​ జంట మైకేల్​ స్లేటర్​, మార్క్​ టేలర్​.. తొలి వికెట్​కు 128 పరుగులు చేశారు.

ఇదీ చూడండి: 'అవును.. ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్లలో నేనూ ఒకడిని!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.