ETV Bharat / sports

' టాస్ వాళ్లు గెలిచినా మ్యాచ్ మేమే గెలిచే వాళ్లం ' - virat kohli

రెండో టెస్టులో టాస్​ ప్రభావం అంతగా ఏమీ లేదని టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ కంటే తాము మెరుగ్గా రాణించడం వల్లే విజయం సొంతమైందని స్పష్టం చేశాడు.

ind vs eng 2nd test toss wouldnt have mattered much in this game says kohli
'పిచ్​లో ఏమీ లేదు.. వారి కంటే మేము మెరుగ్గా ఆడాము'
author img

By

Published : Feb 16, 2021, 4:47 PM IST

చెపాక్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్​ ప్రభావమేమీ లేదని ​భారత సారథి​ కోహ్లీ అభిప్రాయపడ్డాడు.

టీమ్​ఇండియా.. ప్రత్యర్థి జట్టు కంటే మెరుగ్గా ఆడింది. టాస్​ అనేది అంతగా ప్రభావమేమీ చూపలేదు. మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నట్లుగా పిచ్​లో కూడా ఏమీ లేదు. అందుకు నాతో పాటు అశ్విన్​ బ్యాటింగే నిదర్శనం. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి మా జట్టు 600 పరుగులు చేసింది.

-విరాట్ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​.

పర్యటక జట్టు తొలి ఇన్నింగ్స్​లో కేవలం 134 పరుగులకే ఆలౌట్​ అవ్వడం వల్ల.. ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ చెపాక్​ పిచ్​ సుదీర్ఘ ఫార్మాట్​కు పనికి రాదంటూ వ్యాఖ్యలు చేశాడు. కెవిన్​ పీటర్సన్​ కూడా భారత్​ సాహసవంతమైన పిచ్​ను తయారు చేసిందంటూ వ్యంగ్యంగా ట్వీట్​ చేశాడు.

కానీ అదే పిచ్​పై రెండో ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​ చేసిన కోహ్లీ అర్ధ సెంచరీ చేయగా.. బౌలర్ అశ్విన్​ ఏకంగా సెంచరీ సాధించాడు. కాస్త కుదురుకుంటే బ్యాటింగ్​ అలవోకగా చేయవచ్చని వీరిద్దరూ విమర్శకుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

రిషభ్​ మెరుగవుతున్నాడు​..

అధిక బరువు కారణంగా పంత్​ వికెట్ల వెనుక అసౌకర్యంగా కదిలేవాడని కోహ్లీ తెలిపాడు. 'ఆస్ట్రేలియాతో సిరీస్​ నుంచే చాలా కష్టపడ్డాడు. ప్రస్తుత మ్యాచ్​లో అంచనాల మేరకు రాణించాడు. క్రెడిట్​ అంతా అతనికే దక్కుతుంది. పంత్​ను మరింత మెరుగు పరచడానికి ప్రయత్నిస్తాం. అతడు ఎంత విలువైన ఆటగాడో మాకు తెలుసు' అని విరాట్​ పేర్కొన్నాడు.

టెస్టు ఛాంపియన్​ షిప్​లో రెండో స్థానం..

ఈ విజయంతో భారత్​ టెస్టు ఛాంపియన్​ షిప్​లో రెండో స్థానానికి చేరుకుంది. 69.7 శాతం పాయింట్లతో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఇక ఇంగ్లాండ్​ టీసీఎస్​ ఫైనల్​ వెళ్లాలంటే తప్పనిసరిగా తదుపరి రెండు టెస్టులు గెలవాల్సి ఉంది.

ఇదీ చదవండి: టెస్టు విజయాల్లో ధోనీ సరసన విరాట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.