ETV Bharat / sports

Ind Eng Test: ఆ బంతులను వేటాడుతూ.. ఒకరి తర్వాత ఒకరు.. - టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్లు (Indian batsman) మరోసారి పేలవ ప్రదర్శన చేశారు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు (Ind Eng Test) తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. వికెట్లు ఇచ్చేయడంలో మాకు సాటిలేరన్నట్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌ చేరి జట్టును కష్టాల్లోకి నెట్టేశారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

IND vs END Fourth test updates
భారత్​- ఇంగ్లాండ్​ నాలుగో టెస్ట్​
author img

By

Published : Sep 3, 2021, 7:25 AM IST

వికెట్లు అప్పనంగా ఇచ్చేయడం ఎలా..? ఈ విషయంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు (Team India batting) మించి సలహాలు ఇచ్చే వారుండరేమో! ఎందుకంటారా? ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు (Ind Eng Test) తొలి ఇన్నింగ్స్‌లో వారి బ్యాటింగ్‌ చూస్తే అర్థమైపోతుంది. వారు ఔటైన తీరు గమనిస్తే తెలిసిపోతుంది. ఓవల్‌ పిచ్‌పై పెద్దగా పచ్చిక లేదు. ప్రమాదకర స్వింగ్‌ కనిపించలేదు. అయినా ఒక్కరూ నిలబడేందుకు చూడలేదు. సిరీస్‌లో తమను ఇబ్బందులకు గురిచేస్తున్న ఆఫ్‌స్టంప్‌ లోగిలి బంతులను ఓపిగ్గా వదిలేసేందుకు ప్రయత్నించలేదు. ఎవరేమనుకుంటే మాకేంటి. మా ఆట మాదే అన్నట్టుగా.. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులను వేటాడుతూ.. ఒకరి తర్వాత ఒకరు పెవిలయన్‌ చేరి జట్టును కష్టాల్లోకి నెట్టేశారు.

ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో పడ్డ బంతులను సమర్థంగా ఎదుర్కోవాలంటే వాటిని ఆడకుండా వదిలేయడం ఒక్కటే పరిష్కారమని భారత దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) సహా మాజీలు సూచించారు. అందుకు ఉదాహరణగా సన్నీ.. 2004 సిడ్నీ టెస్టులో సచిన్‌ 241 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ గురించీ ప్రస్తావించాడు. తన బలహీనతను అధిగమించేందుకు ఆ ఇన్నింగ్స్‌లో సచిన్‌ ఆఫ్‌సైడ్‌ ఒక్క షాట్‌ కూడా కొట్టలేదని గుర్తుచేశాడు. కానీ నాలుగో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ ఔటైన విధానం చూస్తే వాళ్ల ఆటలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ద ఓవల్‌లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 348 పరుగులైతే.. అతికష్టంగా కోహ్లి బృందం (Team India) 191 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బౌలర్లు వికెట్లు తీయడానికి పెద్దగా శ్రమించింది కూడా లేదు. భారత బ్యాట్స్‌మెన్‌ బలహీనతను పరీక్షిస్తూ ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో సరైన లెంగ్త్‌లో బంతులు వేశారు. అంతే.. బ్యాట్స్‌మెన్‌ తమకు తాము వికెట్లు సమర్పించుకున్నారు. ఈ సిరీస్‌లో అంతో ఇంతో మెరుగ్గా ఆడుతున్న రోహిత్‌ వారి ఉచ్చులో మొదట చిక్కుకున్నాడు.

ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడి అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్‌ కీపర్‌కు చిక్కాడు. ఇక తన పేలవ ఫామ్‌తో జట్టులో చోటు ప్రశ్నార్థకం చేసుకుంటున్న పుజారా మరోసారి తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ అండర్సన్‌ వేసిన చక్కటి బంతిని వెంటాడి వికెట్‌కీపర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన కేఎల్‌ రాహుల్‌ ఆఫ్‌స్టంప్‌ అవతల పడి లోపలికి స్వింగ్‌ అయిన బంతిని ఆడడంలో విఫలమై వికెట్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఇక బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన జడేజా కూడా ఆఫ్‌స్టంప్‌ బయట పడ్డ బంతిని ఆడి స్లిప్పులో బలైపోయాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు టెస్టుల్లో ప్రతిసారి ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతికే వికెట్‌ సమర్పించుకున్న కెప్టెన్‌ కోహ్లి.. కవర్‌డ్రైవ్‌లు ఆడుతూ.. చాలా బంతులను వదిలేస్తూ కనిపించాడు. కానీ అర్ధశతకం చేరుకున్నాక మరోసారి తన బలహీనతను బయటపెట్టి జట్టును మధ్యలో వదిలేసి పెవిలియన్‌ చేరాడు. ఇప్పటికే ఫామ్‌ కోల్పోయి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ రహానె కూడా అదే దారిలో సాగాడు. ఇక పంత్‌ ఎన్ని అవకాశాలొచ్చినా చెత్త షాట్‌లతో వికెట్‌కు విలువ లేకుండా చేసుకుంటున్నాడు. బంతి పిచ్‌ మీద పడి బౌన్స్‌ అవడం.. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకి వికెట్‌కీపర్‌ లేదా స్లిప్‌ ఫీల్డర్ల చేతుల్లో పడడం.. భారత బ్యాట్స్‌మెన్‌ పదేపదే ఇలాగే ఔటవుతుంటే అభిమానుల్లో అసహనం పెరిగిపోతోంది. పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న జట్టుగా పేరున్న టీమ్‌ఇండియా ఇలాంటి ప్రదర్శన చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి: Shardul Thakur: శార్దూల్​ ఠాకూర్ రికార్డు​.. కపిల్​దేవ్​ సరసన చోటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.