ETV Bharat / sports

Ind Eng Test: విహారికి అవకాశం దక్కేనా? - ind vs eng squad

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టు(Ind Eng Test) గెలవడం కోహ్లీ సేనకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదనపు బ్యాట్స్​మన్ హనుమ విహారికి (Hanuma Vihari) జట్టులో ఆడే ఛాన్స్​ కనిపిస్తోంది.

hanuma vihari
హనుమ విహారి
author img

By

Published : Sep 1, 2021, 8:45 AM IST

మూడో టెస్టులో బ్యాట్స్‌మెన్‌ ఘోర వైఫల్యంతో టీమ్‌ఇండియా(Ind Eng Test) ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసింది. కీలకమైన నాలుగో టెస్టులో నెగ్గడం కోహ్లీసేనకు చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ జట్టు(Team India squad) ఎంపికపైనే. చర్చంతా ఎవరు తుది జట్టులో ఉండాలన్నదానిపైనే. ముఖ్యంగా జట్టు అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడిస్తుందా లేదా అన్న విషయం ఆసక్తిరేపుతోంది.

లీడ్స్‌లో తొలి రోజు 78 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. నాలుగో రోజు తన చివరి ఎనిమిది వికెట్లను 63 పరుగులకే చేజార్చుకుంది. అదనపు బ్యాట్స్‌మన్‌ బాగా ఆడతాడన్న గ్యారెంటీ ఏమీ లేదని తర్వాత కోహ్లి(Captain Virat Kohli) వ్యాఖ్యానించాడు. కానీ అతడు కేవలం నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లు, అదనపు బ్యాట్స్‌మన్‌ను ఎంచుకున్న సందర్భాలు ఉన్నాయి. మోకాలి గాయంతో బాధపడుతున్న జడేజా(Jadeja Injury Update) పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే భారత్‌కు.. అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించక తప్పకపోవచ్చు. ఈ పర్యటనలో జడేజా బౌలింగ్‌ ఆడ్‌రౌండర్‌గా కన్నా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌గానే జట్టులో ఉన్నాడు. బంతితో పెద్దగా రాణించలేకపోయాడు. జడేజా బదులు ఎవరినైనా తీసుకోవాల్సివస్తే అతడి బౌలింగ్‌ కన్నా అతడి బ్యాటింగ్‌ స్థానాన్ని భర్తీ చేయడంపై భారత్‌ దృష్టిపెట్టే అవకాశముంది.

ఒకవేళ జడేజా ఫిట్‌గా ఉన్నా.. రహానె, పంత్‌ పేలవ ఫామ్‌ నేపథ్యంలో భారత్‌ మరో బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అప్పుడు సహజంగానే హనుమ విహారి(Hanuma Vihari) జట్టులోకి వస్తాడు. మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అదే.. రాహుల్‌ను మిడిల్‌ ఆర్డర్‌కు మార్చి, రోహిత్‌ జోడీగా మయాంక్‌ లేదా పృథ్వీని బరిలోకి దించడం. అయితే ఆఫ్‌స్పిన్‌ కూడా వేయగల విహారివైపే మొగ్గుచూపే అవకాశాలెక్కువ.

ఇదీ చదవండి:Indvseng: 'పంత్​ మ్యాచ్ విన్నర్.. కాస్త ఓపిక పట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.