భారత్, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఆఖరి టెస్టు(IND Vs ENG) కరోనా కారణంగా రద్దైంది. టీమ్ఇండియా కోచ్ల బృందంలో కరోనా కేసులు రావడం వల్ల మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. అయితే ఈ టెస్టును కచ్చితంగా భవిష్యత్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తామని బోర్డులు వెల్లడించాయి. అయితే భారత్తో చివరి టెస్టు రద్దవ్వడం పట్ల విచారం(James Anderson on 5th Test) వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్. ఆ మ్యాచ్ను ఆస్వాదించాలని చాలామంది అభిమానులు ఆశగా మాంచెస్టర్ చేరుకున్నారని.. వారికి తన క్షమాపణలు తెలియజేస్తున్నాని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. టీమ్ఇండియాతో చివరి టెస్టు రద్దవ్వడం నాలో చాలా నిరాశకు కలిగించింది. ఈ మ్యాచ్ను చూసేందుకు ఎంతోమంది క్రికెట్ అభిమానులు మ్యాచ్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకున్నారు. కానీ, మ్యాచ్ రద్దైన కారణంగా ప్రేక్షకులు మమ్మల్ని మన్నించాలి. ఈ మ్యాచ్ను తిరిగి నిర్వహిస్తారని ఆశిస్తున్నా. దీంతో నేను నా స్వదేశంలో ఇష్టమైన మైదానంలో నేను మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది"
- జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ పేసర్
ఇంగ్లాండ్ పర్యటనలో(India Vs England Test Series) భాగంగా జరగాల్సిన ఐదు టెస్టుల్లో నాలుగు పూర్తయ్యాయి. వాటిలో తొలి టెస్టు వర్షం కారణంగా రద్దువ్వగా.. మిగిలిన మూడు టెస్టుల్లో రెండింటిలో గెలిచిన కోహ్లీసేన 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్(Manchester Test) కరోనా కారణంగా రద్దైంది.
జేమ్స్ అండర్సన్.. తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 166 మ్యాచ్లు ఆడి, 632 వికెట్లు(James Anderson Test Wickets) పడగొట్టాడు. టీమ్ఇండియాతో జరిగిన ఈ సిరీస్లో 15 వికెట్లు తీశాడు.
ఇదీ చూడండి.. IND Vs ENG: ఐదో టెస్టు రద్దుపై రవిశాస్త్రి స్పందన