ETV Bharat / sports

'చివరి సెషన్​లో ఇషాంత్​ బౌలింగ్​​ అద్భుతం' - unsung hero

ఇంగ్లాండ్​తో జరుగుతున్న తొలి టెస్టు చివరి సెషన్​లో రెండు వరుస వికెట్లతో మెరిసిన ఇషాంత్​ శర్మను ప్రశంసించాడు కెవిన్​ పీటర్సన్​. అద్భుతమైన స్పెల్​ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

Fabulous little spell: Kevin Pietersen hails 'unsung hero' Ishant Sharma
'ఇషాంత్​ చివరి స్పెల్​ అద్భుతం'
author img

By

Published : Feb 7, 2021, 9:42 AM IST

Updated : Feb 7, 2021, 11:48 AM IST

తొలి టెస్టు రెండో రోజు చివరి సెషన్​లో వరుస వికెట్లు తీసుకున్న ఇషాంత్​ శర్మను ప్రశంసించాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ కెవిన్​ పీటర్సన్​. 'అద్భుతమైన బౌలింగ్​'​ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

మొదటి టెస్టులో ఐదు సెషన్ల పాటు వికెట్​ లేకుండా కొనసాగిన ఇషాంత్​.. రెండో రోజు చివరి సెషన్లో జోస్​ బట్లర్​, జోఫ్రా ఆర్చర్​లను వరుస బంతుల్లో క్లీన్​ బౌల్డ్​ చేశాడు. దీంతో ఇంగ్లాండ్​ 525 వద్ద 8 వికెట్లు కోల్పోయింది.

170 ఓవర్ల పాటు వికెటు దక్కకుంటే.. ఓ బౌలర్​కు అది జైలు శిక్ష లాంటిదనే చెప్పాలి. చివరి స్పెల్​లో అద్భుతమైన బౌలింగ్​తో జట్టును పోటీలో నిలిపాడు. చివరి సెషన్​లో ఇషాంత్​ ప్రదర్శన ప్రశంసనీయం.

-కెవిన్​ పీటర్సన్​, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్​.

ఇషాంత్​ తీసిన వికెట్లు కీలకమైనవని సహచర బౌలర్​ షాబాజ్​ నదీమ్​ కొనియాడాడు. 'ప్రధాన బ్యాట్స్​మెన్ పెవిలియన్​ చేరడం వల్ల టెయిలెండర్లను త్వరగానే ఔట్​ చేయొచ్చు. అవి చాలా ముఖ్యమైన వికెట్లు. దీంతో ఇంగ్లాండ్​పై కొంత పైచేయి సాధించినట్లు అయ్యింది' అని నదీమ్​ తెలిపాడు.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్​ 555/8 పరుగులతో పటిష్టమైన స్థితిలో నిలిచింది. జో రూట్ ద్విశతకంతో మెరువగా.. బెన్​ స్టోక్స్​ హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఇదీ చదవండి: 8 వేళ్లతో టెన్నిస్​ ఆడేస్తోంది

Last Updated : Feb 7, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.