మరో మూడు రోజుల్లో ప్రారంభమయ్యే డే/నైట్ టెస్టులో టీమ్‌ఇండియా కన్నా తమ ఇంగ్లాండ్ జట్టే ఆధిపత్యం చెలాయిస్తుందని యువ బ్యాట్స్‌మన్ జాక్‌క్రాలే ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ బ్రిటీష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌ఇండియాలో అద్భుతమైన బ్యాటింగ్ లైనప్, పేరొందిన పేస్ బౌలింగ్ త్రయమున్నా తమ జట్టే ఫేవరెట్ అని పేర్కొన్నాడు. అది పేస్ పిచ్ కాబట్టి, అందులో తమకు పూర్తి ప్రావీణ్యం ఉందన్నాడు.
"సీమ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంతోనే మేం క్రికెటర్లుగా ఎదుగుతూ వచ్చాం. కాబట్టి పింక్‌బాల్ టెస్టులో భారత్ కన్నా మేమే ఈ విషయంలో ఫేవరెట్‌గా ఉంటాం. అలాగే టీమ్‌ఇండియా ఆటగాళ్లు కూడా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సిద్ధహస్తులు. అయితే, కోహ్లీసేనలో బలమైన బ్యాటింగ్ లైనప్, అమోఘమైన పేస్‌త్రయం ఉంది కాబట్టి మాకంత తేలిక కాదనే అనుకుంటున్నా. వాళ్ల సామర్థ్యానికి మించి రాణిస్తారు. ఇక బంతి విషయానికొస్తే.. రెడ్ బాల్ కన్నా పింక్ బాలే అధిక బౌన్స్‌తో పాటు స్వింగింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో పేసర్లకు అనుకూలంగా ఉంటుంది."
- జాక్‌క్రాలే, ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మన్
అయితే, తొలి టెస్టుకు ముందు అనూహ్యంగా చెపాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో కిందపడి గాయపడిన అతడు మూడో టెస్టుకు ముందు కోలుకున్నాడు. దీంతో బుధవారం నుంచి ప్రారంభమయ్యే డే/నైట్ మ్యాచ్‌కు ఎంపికయ్యాడు. "గాయం తర్వాత పూర్తిగా కోలుకున్నా. నెట్స్‌లో సాధన చేస్తున్నా. అయితే, రెండో టెస్టుకే కోలుకోవాలని ప్రయత్నించా కానీ కుదరలేదు. ఇక రాబోయే మ్యాచ్‌లో మళ్లీ ఓపెనర్‌గా దిగాలని చెప్పినా నాకేం ఇబ్బంది లేదు. అయితే, జట్టు అవసరాలను బట్టి మూడో స్థానంలో ఆడించినా సిద్ధమే" అని క్రాలే పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: భారత్ Vs ఇంగ్లాండ్: డేనైట్ మ్యాచ్‌కు పిచ్ ఎలా?