ETV Bharat / sports

IndvsEng Test: చారిత్రక విజయానికి అడుగు దూరంలో భారత్‌ - Ind vs Eng match preview

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న సుదీర్ఘ టెస్టు సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో కోహ్లీసేన(Team India England Tour) ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. నేడు (సెప్టెంబర్ 10) ప్రారంభమయ్యే చివరి టెస్టులోనూ ప్రత్యర్థి జట్టును ఓడించి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్‌ జట్టు(England vs India). భారత్‌ చరిత్ర సృష్టిస్తుందో.. ఇంగ్లాండ్‌ సిరీస్‌ను సమం చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!

team india
టీమ్​ఇండియా
author img

By

Published : Sep 10, 2021, 7:18 AM IST

సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌(Ind vs Eng 5th test).. చివరి మ్యాచ్‌లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే, నాలుగు టెస్టుల్లో కలిపి 151 ఓవర్లు విసిరి భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను.. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌(T20 World Cup) దృష్ట్యా అతడిపై మరింత భారం వేయకుండా చివరి మ్యాచుకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫామ్‌లేమితో సతమతమవుతున్న వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెను పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. చివరి అవకాశంగా భావించి మరోసారి రహానెను ఆడించినా.. విఫలమైతే అతడి అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడినట్టే. 33 ఏళ్ల రహానెను జట్టు నుంచి తప్పిస్తే భవిష్యత్‌లో మళ్లీ టెస్టు క్రికెట్‌ ఆడే అవకాశాలు తక్కువే. ఇప్పటికే, ఎంతో మంది యువ ఆటగాళ్లు ఒక్క అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రహానెను పక్కన పెడితే అతడి స్థానంలో యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ లేదా హనుమ విహారిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

మరో పేసర్‌ మహమ్మద్‌ షమీ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడం వల్ల తుది జట్టులో కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. అయితే, ప్రధాన కోచ్‌ రవి శాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కరోనా బారినపడిన కారణంగా.. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది కెప్టెన్‌ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. గత మ్యాచులో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న ఉమేశ్ యాదవ్‌, ఆల్ రౌండ్‌ ప్రదర్శనతో మెరిసిన శార్ధూల్‌ ఠాకూర్‌ల స్థానాలకు ఢోకా లేదు. ఇక గత నాలుగు మ్యాచుల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ కూడా ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉంది. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వవచ్చు.

పట్టుదలగా ఇంగ్లాండ్

నాలుగో టెస్టులో(Ind vs Eng 4th test 2021) పరాజయానికి దీటుగా బదులివ్వాలనే కసితో ఇంగ్గాండ్‌ బరిలోకి దిగనుంది. బెయిర్‌ స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన జోస్‌ బట్లర్‌కి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత మ్యాచుకు దూరం పెట్టిన మార్క్‌ వుడ్‌తో, క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. జేమ్స్ అండర్సన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.

వర్షం ముప్పు

నేటి (సెప్టెంబర్ 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. తొలి రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్‌ రద్దయితే.. సిరీస్‌ భారత్‌ వశమవుతుంది. అదేగనుక జరిగితే ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లాండ్‌(2021)ల్లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

జట్లు..
భారత్ : విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, మయాంక్ అగర్వాల్‌, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఇశాంత్‌ శర్మ, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్, వృద్ధిమాన్‌ సాహా, అభిమన్యు ఈశ్వరన్‌, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌, శార్థూల్ ఠాకూర్‌.

ఇంగ్లాండ్‌ : రోరీ బర్న్స్‌, హసీబ్‌ హమీద్‌, మొయిన్‌ అలీ, జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌, జోస్‌ బట్లర్‌, డాన్‌ లారెన్స్‌, ఓలీ రాబిన్సన్‌, సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, జాక్‌ లీచ్‌, ఓలీ పోప్‌, డేవిడ్‌ మలన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌.

ఇదీ చదవండి:

IND Vs ENG: భారత ఆటగాళ్లకు కరోనా నెగెటివ్​.. యథావిధిగా ఐదో టెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.