ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో వన్డే, టీ20 సిరీస్​లకు బుమ్రా దూరం! - ఇంగ్లాండ్​తో వన్డే, టీ20 సిరీస్​లకు బుమ్రా దూరం!

ఇంగ్లాండ్​తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​లకు టీమ్​ఇండియా పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రానున్న టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​, టీ20 వరల్డ్​ కప్​లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అశ్విన్​.. మళ్లీ వైట్​ బాల్​ క్రికెట్​ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bumrah may be rested for white ball matches against England
ఇంగ్లాండ్​తో వన్డే, టీ20 సిరీస్​లకు బుమ్రా దూరం!
author img

By

Published : Feb 17, 2021, 5:35 AM IST

వచ్చే నెల ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20, వన్డే​ సిరీస్​లకు భారత పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఆటగాళ్లపై అదనపు భారం తగ్గించే విషయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

"గత ఆస్ట్రేలియా సిరీస్​ నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన మొదటి టెస్టు వరకు బుమ్రా దాదాపు 150 ఓవర్లు వేశాడు. తదుపరి మొతెరాలో జరుగనున్న టెస్టుల్లోనూ అతను పాల్గొననున్నాడు. ఈ రెండు మ్యాచ్​ల్లో జస్సీ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల క్రికెట్​కు అతనికి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాం" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ ముందు.. భారత్​ ఆడే చివరి సిరీస్​ ఇంగ్లండ్​తోనే. ఇందులో 3 వన్డేలు, 5 టీ-20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో నటరాజన్​, సైనీ వంటి యువబౌలర్లను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్​ అనంతరం.. బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీలు ఇంగ్లాండ్​తో సిరీస్ కోసం తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. ఐపీఎల్​లో ముంబయి తరఫున బుమ్రా ఎటూ 14 నుంచి 16 వరకు మ్యాచ్​లు ఆడనున్నాడు. ఏదేమైనా బుమ్రా విశ్రాంతిపై.. తుది నిర్ణయం మాత్రం కోచ్​ రవిశాస్త్రి, కెప్టెన్​ కోహ్లీ, బౌలింగ్​ కోచ్​ భరత్​ అరుణ్​లపై ఆధారపడి ఉండనుంది.

అశ్విన్​ను తీసుకొనేనా..

ఇండియా తరఫున టెస్టుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆఫ్​ స్పిన్నర్ అశ్విన్​ను.. ఇంగ్లాండ్​తో టీ20, వన్డే సిరీస్​లకు తీసుకునే అవకాశం ఉంది. 2020 ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడిన యాష్​.. అంచనాల మేరకు రాణించాడు. ప్రస్తుతం అశ్విన్​కు చాహల్​, కుల్​దీప్​ యాదవ్​ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది. చాలా కాలంగా అశ్విన్​ వైట్​ బాల్​ క్రికెట్​కు దూరంగా ఉన్నాడు.

2011లో ఇలాగే పరిమిత ఓవర్ల క్రికెట్​లో స్థానం కోసం ఇబ్బందిపడిన రాహుల్ ద్రవిడ్​.. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టాడు. టెస్టుల్లో అద్భుతంగా ఆడిన ద్రవిడ్​ను వన్డేలకు తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత తన స్థానం విషయంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో రిటైర్మెంట్​ ప్రకటించాడు.

సూర్యకుమార్​కూ అవకాశం..

ముంబయి తరఫున ఐపీఎల్​లో అద్భుతంగా రాణిస్తున్న యువ క్రికెటర్​ సూర్యకుమార్ యాదవ్​నూ.. ఇంగ్లాండ్​తో సిరీస్​లకు తీసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాలతో పర్యటనలకూ అతడిని ఎంపిక చేయలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. రానున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇతనికి ఓ అవకాశం ఇచ్చే యోచనలో యాజమాన్యం ఉంది. కేఎల్​ రాహుల్​, రిషభ్​ పంత్​లు ఇద్దరూ వికెట్​ కీపింగ్​ చేస్తుండటంతో.. సంజు శాంసన్​ కంటే సూర్యకుమార్​నే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదీ చదవండి: గంగూలీ, జై షా పిటిషన్​పై 23న విచారణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.