ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న యాషెస్ సిరీస్‌కు(ashes 2021 ) జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. మొత్తం 17మంది సభ్యులతో కూడిన జట్టులో బెన్‌స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మినహా దాదాపు అందరూ సీనియర్ ఆటగాళ్లే ఉన్నారు(ashes england squad).
కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలపై తొలుత ఇంగ్లాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకానొక దశలో అసలు యాషెస్ జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఇరు దేశాల బోర్డులు చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల కుటుంబాలకు తగిన వసతులు ఏర్పాటు చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా.
మానసిక అనారోగ్యం, చేతి వేలికి గాయం కారణంగా ఆగస్టులో టీమ్ఇండియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. టీ20 ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉండనని చెప్పేశాడు. ఈ నేపథ్యంలో యాషెస్‌లో కూడా స్టోక్స్ ఉండడని అందరు ముందే ఊహించారు. మరోవైపు సామ్ కరెన్, జోఫ్రా ఆర్చర్లు గాయాల కారణంగా తప్పుకున్నారు.
స్క్వాడ్:-
జో రూట్(కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, బెయిర్‌స్ట్రో, డామ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరి బర్న్స్, జాస్ బట్లర్, జాక్ క్రాలీ, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలన్, క్రయాగ్ ఓవర్టన్, ఓలి పోప్, ఓలి రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
ఐదు టెస్టుల సిరీస్(ashes 2021 schedule) డిసెంబర్ 8న బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. డిసెంబర్ 26న మెల్బోర్న్లో బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్.. జనవరి 14న పెర్త్‌లో ప్రారంభంకానుంది.
ఇదీ చూడండి:- Ashes 2021: ఇంగ్లాండ్ క్రికెటర్లను కవ్వించిన పైన్