ఐపీఎల్(IPL 2021 News) రెండో దశ నుంచి ఇప్పటికే పలువురు ఇంగ్లాండ్ క్రికెటర్లు వైదొలిగారు. అయితే.. ప్లే ఆఫ్స్ సమయానికి మిగతా ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయా జట్లకు ఇది ఇబ్బందికర విషయంగా మారనుంది.
కారణమిదేనా?
యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ కోసం ఇంగ్లాండ్(IPL England Players) ఆటగాళ్లందరూ ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఇటీవలే మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన భారత్, ఇంగ్లాండ్ ఐదో టెస్టు(Ind vs Eng 5th Test) కరోనా కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్ల మధ్య మనస్పర్థలు వచ్చాయి! ఈ కారణంగానే మెగాలీగ్కు దూరమవ్వాలని ఇంగ్లీష్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారని ప్రచారం సాగుతోంది.
ఇప్పటికే జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, బెయిర్ స్టో, డేవిడ్ మలన్ ఈ ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యారు. ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్ కార్టన్ మాత్రం టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికకానందున ఐపీఎల్ ముగిసేవరకు ఆడనున్నాడు. ఇతడు ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఐపీఎల్ 2021 గ్రూప్ స్టేజ్ అక్టోబర్ 8న ముగియనుంది. ఆ తర్వాత రోజే ఇంగ్లాండ్(England vs Pakistan) ఆటగాళ్లు పాకిస్థాన్ ప్రయాణం కానున్నారట! అక్టోబర్ 14, 15న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
ఐపీఎల్ రెండో దశ సెప్టెంబరు 19నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.
ఇదీ చదవండి:
ఐపీఎల్ 2021: వారు వైదొలిగారు.. వీరు వచ్చారు!
IPL 2021: ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్లు