లార్డ్స్ టెస్టు మూడో రోజు దాదాపు ఆధిపత్యం మొత్తం ఇంగ్లాండ్దనే చెప్పాలి. ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశామన్న సంతృప్తి తప్పితే మిగిలిందేమి లేదు. రూట్ భారీ సెంచరీతో(180; 321 బంతుల్లో) భారత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటివేసింది ఇంగ్లాండ్.
119/3తో మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ తొలి సెషన్లో 97 పరుగులు జోడించింది. వికెట్ కోల్పోకుండా భారత బౌలర్లకు చిరాకు తెప్పించారు రూట్- బెయిర్ స్టో ద్వయం. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ టీమ్ఇండియా సహనాన్ని పరీక్షించారు. నాలుగో వికెట్‌కు 121 పరుగులు నమోదు చేసి తమ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 216/3తో లంచ్ విరామానికి వెళ్లింది ఇంగ్లాండ్.
అనంతరం కాసేపటికే బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది ఆతిథ్య జట్టు. సిరాజ్ ఈ జోడీని విడగొట్టి మూడో రోజు తొలి వికెట్‌ను అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జోస్ బట్లర్ కూడా రూట్‌కు సహకరించాడు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించింది రూట్- బట్లర్ జంట. ఈ జోడీని ఇషాంత్ విడగొట్టాడు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ కూడా ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్‌కు సహకరిస్తూనే చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. ఆరో వికెట్‌కు వీరిద్దరూ 58 రన్స్ అందించారు.
టీ విరామం అనంతరం వరుసగా రెండు వికెట్లు అందించాడు ఇషాంత్. అలీ, సామ్ కరన్‌ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తర్వాత కొద్దిసేపటికే రాబిన్సన్ను సిరాజ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. లేని రన్‌కు ప్రయత్నించి మార్క్ వుడ్ రనౌట్‌గా వెనుదిరిగాడు.
రూట్ సెంచరీ..
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆసాంతం కెప్టెన్ రూట్ ఇన్నింగ్సే హైలైట్. రెండో రోజు ముగిసేప్పటికీ 49 పరుగులతో ఉన్న రూట్.. మూడో రోజు ఆట రెండో బంతికే ఫోర్‌తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. సహచర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. బెయిర్ స్టోతో కలిసి నాలుగో వికెట్‌కు 121 పరుగులు, బట్లర్‌తో కలిసి 54, మొయిన్ అలీతో కలిసి 58 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో భారత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని దాటేసింది ఇంగ్లాండ్.