నాటింగ్‌హామ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు స్లోఓవర్ రేటు కారణమైంది. దీంతో ఇరుజట్లకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ జరిమానా విధించింది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో చెరో రెండు పాయింట్ల కోత విధించనున్నట్లు స్పష్టం చేసింది.
"ఇరుజట్లకు పాయింట్ల కోత విధించడమే కాకుండా.. ఆతిథ్య జట్టు స్లోఓవర్ రేటు కారణంగా మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించాం. టీమ్ఇండియాకూ మ్యాచ్ రిఫరీ ద్వారా 40 శాతం కోత ఉంటుంది."
- ఐసీసీ ప్రకటన
నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో చివరిరోజు వర్షం కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో గురువారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఇచ్చిందే 4.. కోత ఏంటి?
నెమ్మది ఓవర్ల కారణంగా కోత విధించడం అభిమానులకు నచ్చడం లేదు. ఐసీసీ తీరును వారు విమర్శిస్తున్నారు. మరి వాతావరణం బాగా లేకపోవడం, వర్షంతో ఆఖరి రోజు ఆట సాగకపోవడంపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వర్షం కురిసినందుకు మ్యాచ్ ఫీజు, పాయింట్లలో కోత లేదా? అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.
ఇప్పుడు 2 పాయింట్ల కోత విధించడంతో చెరో 2 పాయింట్లతో పట్టికలో నిలిచాయి. ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించే క్రమంలో ఈ పాయింట్ల కోత ఇబ్బంది కలిగించే అవకాశం లేకపోలేదు.
ఇదీ చూడండి.. ఐసీసీ నిద్రపోతుందా?.. ఇంజమామ్ ఆగ్రహం!