ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాభవం చవిచూసింది పాకిస్థాన్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ యువ బౌలర్ సకీబ్ మహ్మూద్ (4/42) పాక్ క్రికెటర్లకు చుక్కలు చూపించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. మరో 15 ఓవర్లు మిగిలుండగా 141 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఆదిలోనే అరంగేట్ర బ్యాట్స్‌మన్ ఫిలిప్ సాల్ట్(7) వికెట్ కోల్పోయింది. అయితే డేవిడ్ మలన్(68*), జాక్ క్రాలీ(58*) మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు.
కుర్రాళ్ల చేతిలో..
అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ దాదాపు కొత్త జట్టుతోనే బరిలోకి దిగడం విశేషం. కరోనా కారణంగా తొలుత అనుకున్న సీనియర్ జట్టు ఐసోలేషన్‌కు వెళ్లగా.. 15 మందితో కొత్త జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. అందులో 9 మంది పూర్తిగా కొత్తవాళ్లు. అలాంటి జట్టు చేతిలో పాక్ చతికిలపడిపోయింది.
ఇదీ చూడండి: భారత్-ఇంగ్లాండ్ టెస్టులు ఆగితే కోట్ల డాలర్లు నష్టం?