ETV Bharat / sports

ENG VS SL: రెండో టీ20 గెలుపు.. సిరీస్​ ఇంగ్లాండ్ సొంతం - ఇండియా vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

మరో మ్యాచ్​ మిగిలుండగానే శ్రీలంకతో టీ20 సిరీస్​ సొంతం చేసుకుంది ఇంగ్లాండ్. మూడో మ్యాచ్ శనివారం జరగనుంది.

ENG VS SL: England down Sri Lanka to claim T20I series win
ఇంగ్లాండ్
author img

By

Published : Jun 25, 2021, 9:56 AM IST

శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. మరో మ్యాచ్​ మిగిలుండగానే 2-1 తేడాతో సిరీస్​ దక్కించుకుంది. గురువారం రాత్రి జరిగిన టీ20లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఇంగ్లీష్ జట్టు.

కార్డిఫ్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 20 ఓవర్లలో 111/7 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా మధ్యలో వర్షం అంతరాయం కలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్​ను 18 ఓవర్లకు కుదించి, లక్ష్యాన్ని 103గా నిర్ణయించారు. దీనిని 16.1 ఓవర్లకే పూర్తి చేసి, మ్యాచ్​ గెలిచింది ఇంగ్లాండ్.

ENG VS SL
ఇంగ్లాండ్ vs శ్రీలంక

ఈ రెండు జట్ల మధ్య మూడో టీ20 శనివారం(జూన్ 26) జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల్లో తలపడనున్నాయి. అనంతరం కొన్నిరోజుల తర్వాత అంటే ఆగస్టు 4 నుంచి టీమ్​ఇండియాతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడనుంది ఇంగ్లాండ్.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.