ETV Bharat / sports

రాహుల్​పై బీరు కార్క్స్​.. ఇంగ్లాండ్​ ఫ్యాన్స్​ అత్యుత్సాహం - england fans lord's test

లార్డ్స్​ టెస్టు మూడో రోజు ఇంగ్లాండ్​ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. టీమ్​ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్​పై బీర్ కార్క్స్​ విసిరారు.

India vs England
ఇండియా vs ఇంగ్లాండ్
author img

By

Published : Aug 14, 2021, 6:50 PM IST

లార్డ్స్​లో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్​ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. టీమ్​ఇండియా ఆటగాడు కేఎల్​ రాహుల్​ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి దగ్గరలో బీర్​ బాటిల్​ కార్క్స్​​ (మూతలు) విసిరారు.

మూడో రోజు ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​ 68వ ఓవర్​ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీన్ని గమనించిన వ్యాఖ్యాతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండుసార్లు రాహుల్​కు దగ్గరగా బీరు మూతలు విసిరినట్లు వాళ్ల కామెంట్రీలో పేర్కొన్నారు.

ఇంగ్లాండ్​ ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనను గమనించిన భారత కెప్టెన్​ కోహ్లీ ఈ అంశంపై ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆ మూతలను తిరిగి స్టాండ్స్​లోకి విసిరేయాలని రాహుల్​కు సూచించాడు. కానీ, రాహుల్​ ఆ పని చేయలేదు.

అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్​లో కేఎల్ రాహుల్​ మెరుగైన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. టీమ్ఇండియా భారీ స్కోరు చేయడానికి ఉపకరించాడు.

ఇదీ చదవండి: రూట్, బెయిర్​ స్టో​ హాఫ్ సెంచరీలు.. తొలి సెషన్​ ఇంగ్లాండ్​దే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.