బార్సిలోనా అనగానే క్రీడాభిమానులకు ముందుగా గుర్తొచ్చేది మెస్సీ. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు ఇన్నేళ్లు ప్రాతినిధ్యం వహించిన బార్సిలోనాలో ఆ ఆటకు క్రేజ్ అంతా ఇంతా కాదు! అలాంటి ప్రదేశంలో క్రికెట్‌కు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఓటింగ్ నిదర్శనం. ఎలాంటి సదుపాయాలు కావాలని ప్రభుత్వం అక్కడి ప్రజలను అడగగా.. 'క్రికెట్ గ్రౌండ్'కే అత్యధిక ఓట్లు పడటం విశేషం. ఇది చూసి అక్కడి అధికారులే షాక్ అయ్యారు.
అలా మొదలైంది!
ఈ వ్యవహారంపై నివేదికను ఓ ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ ప్రచురించింది. 822 ప్రాజెక్టులను అందించి.. 30 మిలియన్ యూరోల ప్యాకేజీతో ఏ సదుపాయం కావాలని అడిగింది. ఫలితంగా ఎక్కువ ఓట్లు క్రికెట్ గ్రౌండ్‌కే పెడ్డాయి. నరనరాల్లో ఫుట్‌బాల్ జీర్ణించుకుపోయిన ప్రాంతంలో క్రికెట్‌కు ఆదరణ పెరగడానికి కారణం ఓ మహిళల బృందమేనని నివేదిక వివరించింది.
"ఇది సాధ్యపడింది అంటే, అక్కడ ఉన్న కొందరు మహిళల వల్లే. 20ఏళ్ల హఫ్జ బట్కు 2018లో క్రికెట్ తొలిసారి పరిచయమైంది. పాఠశాల తర్వాత క్రికెట్ క్లబ్ ప్రారంభిచమని జిమ్ టీచర్ అమెకు చెప్పారు. క్లబ్ ఏర్పాటు చేసినప్పటికీ, అక్కడి భారత్-పాకిస్థాన్ కుటుంబాలకు క్రికెట్ రూల్స్ కూడా తెలియవు. ఆ జిమ్ టీచర్‌కి కూడా తెలియదు. కానీ బట్ తండ్రి క్రికెట్ గురించి వారికి చాలా నేర్పారు."
--- నివేదిక.
క్రికెట్‌ను ఆటగా కాకుండా, మహిళా సాధికారత కోసం, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగపడే ఆయుధంగా పరిగణిస్తున్నట్టు తెలిపింది. ఇంతకాలం బేస్‌బాల్ గ్రౌండ్లలో క్రికెట్ ఆడినట్టు చెప్పిన బట్.. ఇప్పుడవి ఖాళీగా లేవని పేర్కొంది.
"11మంది ప్లేయర్లతో క్రికెట్‌ను సరైన విధానంలో ఆడాలనుకుంటున్నాం. టెన్నిస్ బాల్‌తో కూడా ఆడాలనుకోవడం లేదు. అందుకు మాకు సరైన పిచ్ కావాలి. భవిష్యత్తులో కేటలాన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌ను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం."
--- హఫ్జ బట్, బార్సిలోనా
ఇదీ చూడండి:- ఒలింపిక్స్‌లో క్రికెట్- ఐసీసీ 'భారత్ ఫ్యాన్స్' అస్త్రం!