ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌పై మాజీ వికెట్‌కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో ఛెతేశ్వర్ పుజారా, బౌలింగ్‌లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కివీస్‌తో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక ఈ పోరులో అత్యధిక పరుగులు, ఎక్కువ వికెట్లు తీసే క్రికెటరెవరనేది అంచనా వేశాడు.
"తొలిసారి జరుగుతున్న డబ్ల్యూటీసీ పోరులో భారత్ తరఫున పుజారా కీలకం కానున్నాడు. భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే అతడు మూడో స్థానంలో క్రీజులోకి రావాలి. ఒకవేళ టీమ్ఇండియా త్వరగా వికెట్లు కోల్పోతే అతడు ఓ మూడు నాలుగు గంటలు క్రీజులో గడిపితే చాలు. కోహ్లీసేన పటిష్ఠమైన స్థితిలో ఉంటుంది. ఈ మ్యాచ్‌లో పుజారానే అత్యధిక పరుగులు చేస్తాడు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, ఇషాంత్ ఉన్నప్పటికీ.. షమీనే కీలకం కానున్నాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు తగ్గట్లు అతడి బౌలింగ్ తీరు ఉంటుంది."
-పార్థివ్ పటేల్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
కాగా, భారత మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయంలో వేరే విధంగా అంచనా వేశాడు. బ్యాటింగ్‌లో కేన్ విలియమ్సన్ అత్యధిక పరుగులు చేస్తాడని, బౌలింగ్‌లో మాత్రం ట్రెంట్ బౌల్ట్‌తో పాటు మహమ్మద్ షమీ రాణిస్తారని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: కోహ్లీ.. వన్డేల్లో ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్.. ఎందుకంటే?