Dhoni Tip For Bachelors : టీమ్ఇండియా మాజీ సారథి కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ తాజాగా లవ్ గురు అవతారమెత్తాడు. తన ఆటతీరుతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఈ స్టార్ ప్లేయర్.. తాజాగా యువతకు ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ధోనీ తన స్టైల్లో సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై అందరినీ ఆకట్టుకుంటోంది.
"మీరు ఎవరితోనైనా సంతోషంగా ఉంటే వారిని కచ్చితంగా పెళ్లి చేసుకోండి. గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్‌లర్స్‌లో ఉండే ఓ దురభిప్రాయంపై నేను ఈ రోజు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. 'నా గర్ల్ ఫ్రెండ్ మిగిలిన వారి కంటే డిఫరెంట్' అని అనుకోవద్దు" అని పేర్కొన్నాడు. దీంతో ఆడిటోరియంలో ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది.
-
🤣🤣@msdhoni pic.twitter.com/D2Sg4WIUXt
— Raghu (@meerkali7781) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🤣🤣@msdhoni pic.twitter.com/D2Sg4WIUXt
— Raghu (@meerkali7781) October 26, 2023🤣🤣@msdhoni pic.twitter.com/D2Sg4WIUXt
— Raghu (@meerkali7781) October 26, 2023
"ఒక బంధంలోకి అడుగుపెట్టడం మీ జీవితంలో ఎంత వరకు స్థిరత్వాన్ని ఇచ్చింది" అని యాంకర్ మరో ప్రశ్న అడిగారు. దీనికి కూడా అతడు కూల్‌గానే స్పందించాడు. ఈ సమాధానం కూడా ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాదు ఆలోచించేలా కూడా చేసింది.
" ఇక్కడున్న వారిలో ఎంత మందికి పెళ్లైంది.. ఇలా అడిగితే మీలో చాలా మంది నవ్వుతారు. కానీ, ఇది చాలా సీరియస్ ప్రశ్న. అది సరే.. మీలో ఎంత మందికి గర్ల్‌ఫ్రెండ్ ఉంది.. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందామని అనుకునేవారు ఎంత మంది ఉన్నారు. మీరు ఆ బంధాన్ని ఎలా చూస్తున్నారన్న అంశంపైనే ఆధారపడి ఉంటుంది. మీ లైఫ్‌లో మసాలా.. వైఫ్ నుంచే వస్తుంది. ఆమె మీ జీవితం క్రమం తప్పకుండా ముందుకు నడిచేట్లు చేస్తుంది. మీరు భారత జట్టుకు కెప్టెనా లేకుంటే మాజీ కెప్టెనా అనేది వారికి అనవసరం. మీకంటూ ఇంట్లో ఓ స్థానం ఉంటుంది. సాధారణంగా ఆ స్థానం మీ ఛాయిస్ కాదు. దీనిలో అద్భుతమైన విషయం ఏమిటంటే.. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి.. కానీ, మొత్తంగా వాళ్లు అనుకున్నది కూడా మీ చేతే చేయిస్తారు. మీ నిర్ణయం ప్రకారమే అది చేశారు అని అనిపిస్తారు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం.. 'నేను ముందే చెప్పాను. నువ్వే ఈ డెసిషన్ తీసకున్నావు' అని చెప్పేస్తారు. గందరగోళాన్ని సృష్టించడం ద్వారా.. జీవితంలో గందరగోళాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించే ట్రైనర్స్ ఇంట్లో ఉన్నట్లే. ఇలా సరదాగా మనం చెప్పుకోవచ్చు. కానీ, వారు మన బలానికి మూలస్తంభం వంటి వారు" అని ధోని సరదాగా జీవిత భాగస్వామి విలువను వివరించాడు.
Dhoni New Look : వింటేజ్ లుక్‌లో ధోనీ కొత్త ఫొటోలు.. ఆ స్టార్ హీరోలానే ఉన్నాడుగా..