అర్ధ శతకమో, శతకమో సాధిస్తే కత్తి సాము మాదిరి బ్యాట్ తిప్పుతూ రవీంద్ర జడేజా మైదానంలో చేసే సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ విన్యాసం కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఇతడి ఈ స్టైల్‌ను కొంతమంది క్రికెటర్లూ అప్పుడప్పుడూ అనుకరిస్తూ కనిపిస్తారు. తాజాగా ధోనీ.. జడేజా బ్యాట్సామును అనుకరిస్తూ కనిపించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్ సందర్భంలో ధోనీ, ఉతప్ప సరదాగా మాట్లాడుకుంటున్నారు. జట్టులోను మరో ఆటగాడిని చూపిస్తూ ధోనీ కత్తిసాము చేసినట్లు అనుకరించాడు. అది జడేజానే కావచ్చు అంటూ నెటిజన్లూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి జడేజా స్పందిస్తూ బ్యాట్‌తో అలా చేయాలని సూచించాడు.
మైదానంలో ఇతడి సెలబ్రేషన్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకోసమే ఇటీవల నిజమైన కత్తిసాము చేస్తూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు జడేజా. ఇది కాస్తా అప్పట్లో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">