Devilliers Opinion Virat As Opener: టీమ్ఇండియా స్టార్ విరాట్ కోహ్లీకి టీ20ల్లో ఓపెనర్‌గా మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ, అతడు ఇన్నింగ్స్ ప్రారంభించడం తనకు ఇష్టం లేదన్నాడు సౌతాఫ్రితా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్. అతడు ఓపెనర్‌గా కన్నా, నెం.3లోనే అత్యుత్తమ ప్లేయర్ అని పేర్కొన్నాడు. ఒకవేళ విరాట్ ఓపెనింగ్‌లో దిగితే డాట్ బాల్స్ చేయోద్దన్న ఉద్దేశంతో త్వరగా వికెట్ పారేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఆడినప్పుడు ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయోద్దని అనేకసార్లు విరాట్‌కు చెప్పినట్లు డివిలియర్స్ గుర్తుచేసుకున్నాడు. యూట్యూబ్‌లో తన సొంత ఛానెల్ 'మిస్టర్ 360 షో'లో రీసెంట్గా డివిలియర్స్ ఈ కామెంట్స్ చేశాడు.
'విరాట్ విషయంలో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. మేం భారత్‌తో ఆడుతున్నప్పుడు, విరాట్ నెం.3లో బ్యాటింగ్ చేయడం మాకు పెద్ద సవాల్. అతడు మిడిలార్డర్లో పాతుకుపోతాడు. వాస్తవానికి నెం.3 మిడిలార్డర్ కాదు. అది కూడా టాపార్డరే. అయినా మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లతో కూడా పార్ట్నర్షిప్ నెలకొల్పే సత్తా ఉన్నవాడు. అలా ఆడడం అసాధ్యం. అయితే ఓపెనర్‌గా విరాట్ గణాంకాలు అంత పేలవంగా లేకపోయినా, ఓ విషయం చెబుతా. ఇన్నింగ్స్‌లో విరాట్ తొలి బంతిని ఎదుర్కొన్నప్పుడు అతడి సగటు 23, స్టైక్ రేట్ 138 గా ఉంది. అదే అతడు నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉంటే సగటు 140, స్ట్రైక్ రేట్ 173గా ఉంది. అదే వన్‌డౌన్‌లో 79 మ్యాచ్‌ల్లో 55 సగటుతో పరుగులు చేశాడు. అప్పుడు అతడి స్ట్రైక్ రేట్ 135గా ఉంది. అందుకే విరాట్ నెం.3లోనే బ్యాటింగ్ చేయడాన్ని ఇష్టపడతాను. ఈ స్థానంలో అతడు జట్టు విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించాడు' అని డివిలియర్స్ అన్నాడు.
Virat Comeback T20's: తాజాగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో14 నెలల తర్వాత టీ20ల్లో విరాట్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ వన్‌డౌన్‌లో బరిలో దిగిన విరాట్ దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు సహా, 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ స్ట్రైక్ రేట్ 181.25 కావడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'విరాట్, నేను చాటింగ్ చేసుకుంటున్నాం- క్రికెట్ నేర్చుకున్నాక భారత్‌కు వస్తా'