ETV Bharat / sports

Deodhar Trophy Riyan Parag : 'ఓవరాక్షన్‌ ప్లేయర్‌' అన్న నోళ్లతోనే.. శభాష్‌ అనిపించుకుంటూ..

Deodhar Trophy Riyan Parag : మైదానంలో ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన టీమ్​ఇండియా యంగ్​ క్రికెటర్​ రియాన్‌ పరాగ్​.. దియోదర్‌ ట్రోఫీ-2023లో అదరగొట్టాడు. బ్యాట్‌తోపాటు బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ సంగతులు..

deodhar trophy riyan parag
deodhar trophy riyan parag
author img

By

Published : Aug 4, 2023, 4:08 PM IST

Deodhar Trophy Riyan Parag : మైదానంలో అతి ప్రవర్తన కారణంగా ఓవరాక్షన్​ ప్లేయర్​గా ముద్ర వేసుకున్న టీమ్​ఇండియా యువ ఆటగాడు రియాన్​ పరాగ్​.. తనను తిట్టిన నోళ్లతోనే శభాష్​ అనిపించుకున్నాడు. తాజాగా ముగిసిన దియోదర్​ ట్రోఫీ-2023లో బ్యాట్​తోపాటు బంతితో కూడా చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్​లు ఆడిన రియాన్​.. టాప్​ స్కోరర్​గా నిలిచాడు. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు సాధించాడు. బంతితోనూ రియాన్​ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన రియాన్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు.

Deodhar Trophy Riyan Parag Highlights : 2023 దియోదర్​ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ జట్టు తరఫున ఆడిన రియాన్​.. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్నాడు. అయితే సౌత్‌ జోన్‌తో గురువారం (ఆగస్ట్‌ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ తన జట్టును విజేతగా నిలిపేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్‌ చేసిన రియాన్‌.. ఆ తర్వాత బ్యాట్‌తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్‌.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్‌ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన రియాన్‌.. ఆరో వికెట్‌గా వెనుదిరగడంతో ఈస్ట్‌ జోన్‌ ఓటమి ఖరారైంది.

Deodhar Trophy Final : కాగా, దియోదర్‌ ట్రోఫీ ఫైనల్​లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌ జోన్‌.. రోహన్‌ కున్నుమ్మల్‌ (107), మయాంక్‌ అగర్వాల్‌ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్‌ జోన్‌.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్​ అయ్యి 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో రియాన్‌ పరాగ్‌, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు.

దియోదర్‌ ట్రోఫీ-2023లో రియాన్‌ పరాగ్‌ స్కోర్లు, వికెట్లు..

  • నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై 13 పరుగులు, 4 వికెట్లు
  • నార్త్‌ జోన్‌పై 131 పరుగులు, 4 వికెట్లు
  • సౌత్‌ జోన్‌పై 13 పరుగులు, ఒక వికెట్‌
  • వెస్ట్‌ జోన్‌పై 102 నాటౌట్‌
  • ఫైనల్​లో సౌత్‌ జోన్‌పై 95 పరుగులు, 2 వికెట్లు
    • Congratulations to South Zone for winning the 2023 Deodhar Trophy! 🏆 Stellar all round performances and cohesive teamwork have made them the deserving champions! @BCCI pic.twitter.com/vlaiDUKmUe

      — Jay Shah (@JayShah) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.