విధి వైపరిత్యమో లేక దురదృష్టమో గానీ.. ఐసీసీ టోర్నీ ఫైనల్‌కు వచ్చేసరికి టీమ్ఇండియా తడబాటు కొనసాగుతూనే ఉంది. తొలి నుంచి అద్భుతంగా ఆడే జట్టు.. తుది పోరులో చేతులెత్తేస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తోనూ అదే పునరావృతమైంది. దీంతో టీమ్ఇండియాను 'ఛోకర్స్' అని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.
ఛోకర్స్ అంటే తొలి నుంచి అదరగొట్టి.. ఆఖరున అసలైన మ్యాచ్‌లో బోల్తా కొట్టడం. ఈ బిరుదు సౌతాఫ్రికాకు ఉండేది. ఇప్పుడు దాని సరసన టీమ్ఇండియా చేరుదంటూ కొందరు హేళన చేస్తుంటే.. మరి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాటి నుంచి కలగానే..
టీమ్ఇండియాపై డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన కివీస్‌కు.. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇదే తొలి ఐసీసీ టైటిల్. అయితే.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియాకు ఇంకా అది కలగానే ఉంది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీనే చివరిది. అప్పటినుంచి రెండు(2015, 2019) వన్డే ప్రపంచకప్‌లు, మరో రెండు(2014, 2016) టీ20 ప్రపంచకప్‌లు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయింది టీమ్ఇండియా.
దీంతో సహజంగానే అభిమానుల్లో తీవ్రమైన అసంతృప్తి, కోపం నెలకొంది. అందుకే వారి అసహనాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లగక్కుతున్నారు. టీమ్ఇండియాను 'ఛోకర్స్' అని పిలుస్తున్నారు.
ప్చ్ కోహ్లీ..
ఐసీసీ ఈవెంట్లో 2008లో అండర్19 ట్రోఫీనే కెప్టెన్‌గా కోహ్లీకి చివరిది. అది మినహా 2017లో ధోనీ నుంచి అన్ని ఫార్మట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీకి చేదు జ్ఞాపకాలే మిగులుతున్నాయి. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా అతడి సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక ఫార్మాట్లో సారథ్య బాధ్యతలను కోహ్లీ వదులుకుంటాడనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక అక్టోబరులో భారత్ ఆతిథ్యంలో జరిగే టీ20 ప్రపంచకప్‌తోనైనా కోహ్లీ నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.
ఇవీ చూడండి: