Ind vs SA: టీమ్ఇండియాతో జరగనున్న సిరీస్‌లో మూడో టెస్టుకు దక్షిణాఫ్రికా వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్ దూరంకానున్నట్లు తెలుస్తోంది. అతడి భార్య సాషా జనవరి తొలినాళ్లలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుండటమే అందుకు కారణం. అయితే బయోబబుల్ సహా ఇతర ఆంక్షల వల్ల రెండో టెస్టుకూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. జనవరి 3-7 వరకు రెండో టెస్టు, 11-15 వరకు మూడో టెస్టు నిర్వహించనున్నారు. అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో తలపడతాయి ఇరు జట్లు.
ఇదీ చూడండి: ప్రపంచ ఛాంపియన్‌గా టీమ్ఇండియా.. మా లక్ష్యం అదే: రోహిత్