టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup) ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner news). ఫామ్‌లో లేడంటూ అందరూ చేసిన విమర్శలను తప్పని నిరూపించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తనను పక్కన పెట్టడంపై స్పందించాడు వార్నర్.
"ఓ జట్టును ఎంతగానో ప్రేమించి.. ఆ జట్టు తరఫునే ఏళ్లుగా ఆడుతున్నాను. కానీ, కెప్టెనీ నుంచి తొలగించి కనీసం కారణం కూడా చెప్పలేదు. ఇది చాలా బాధించింది. కానీ, ఎవ్వరిపై ఫిర్యాదు చేయాలని అనుకోవట్లేదు. భారత అభిమానులు ఎప్పుడూ నాకు మద్దతుగానే ఉంటారు. అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకే ఆడతాం. ఆటగాడిగా మరింత ఎదిగేందుకే ప్రయత్నిస్తుంటాం"
--డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్.
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు(Warner on SRH) తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు వార్నర్. మిగతా మ్యాచ్‌ల్లో అతడికి అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ మెరుగైన బ్యాటింగ్ కోసం నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేశానని వార్నర్ చెప్పుకొచ్చాడు.
గత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనతో వార్నర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ కారణంగా సన్‌రైజర్స్ జట్టు వార్నర్‌ను కెప్టెన్‌గా తొలగించింది. కనీసం అతడికి కారణం కూడా చెప్పలేదు. ఆటగాడిగానూ జట్టులో అవకాశాలు తగ్గించింది. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ అనంతరం వార్నర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చదవండి: