David Warner IPL 2022: డేవిడ్ వార్నర్ అనగానే క్రికెట్ అభిమానులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ గుర్తొస్తుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వార్నర్ చేసిన సేవలు అలాంటివి. తన బ్యాటింగ్‌తో జట్టుకు ఎన్నో విజయాలు చేకూర్చాడు. 2016 ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు టైటిల్ తీసుకొచ్చాడు. కానీ ఆ తర్వాత 'సాండ్ పేపర్గేట్' వ్యవహారంలో దాదాపు ఏడాది పాటు క్రికెట్ ఆడలేదు. దాంతో 2018 ఐపీఎల్ సీజన్ నుంచి సన్‌రైజర్స్ వార్నర్‌ను పక్కకు పెట్టింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించింది. అతని స్థానాన్ని న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్స్‌న్‌తో భర్తీ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే.. ఈ ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఐపీఎల్ 2022లో కొత్త గూటికి చేరాడు. గత కొన్నేళ్ల నుంచి ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరపున కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన ఈ ఆటగాడ్ని దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఈ సారి వేలంలో ఇతని కోసం రూ.6.25 కోట్లు వెచ్చించింది.
IPL 2022 David Warner News: ఈ సారి ఐపీఎల్లో కొత్త టీమ్ తరపున ఆడుతున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేశాడు వార్నర్. విలియమ్స్‌న్ కూతురుతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఫొటోతో భావోద్వేగ ట్వీట్ చేశాడు. "విలియమ్స్‌న్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ను మిస్ అవుతున్నా. అతనితో కలిసి ఆట ఆడే అవకాశం కోల్పోయాను" అని తెలిపాడు.
సన్‌రైజర్స్ జట్టుకు ఆడిన వార్నర్ అత్యధిక పరుగులు చేశాడు. 95 ఇన్నింగ్స్‌లో 4014 రన్స్ సాధించాడు. స్ట్రైక్ రేటు 140 పైనే నమోదు చేశాడు. రెండు సెంచరీలు, 40 అర్థ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. వార్నర్ తన ఐపీఎల్ కేరీర్‌ను దిల్లీ డేర్‌డెవిల్స్ నుంచే ప్రారంభించాడు. తాజా ఐపీఎల్లో మళ్లీ సొంత గూటికే చేరుకున్నాడు.
ఇదీ చదవండి: IPL: వేలంలో రూ.10 కోట్లు.. ఫ్రెండ్స్‌కు పిజ్జా పార్టీ!