దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాది ఫుల్ జోష్ మీదున్న ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్.. రిటైర్మెంట్ గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌కు తనను పక్కనపెడితే జట్టుకు దూరంగా ఉంటానంటూ పరోక్షంగా రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. కాగా, అంతకుముందు రీసెంట్గా తాను ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తే మొదటగా టెస్టు క్రికెట్‌కే గుడ్‌బై చెబుతానని అన్నాడు.
ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికాతో ఆడిన రెండో టెస్టు తర్వాత ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు... 'ఇదే మీ చివరి బాక్సింగ్ టెస్టా? అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానం చెప్పాడు. "నేను వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ ఆడాలనుకుంటున్నాను. అందుకోసం ఫిట్‌గా ఉంటూ మంచి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ నన్ను పక్కనపెడితే మాత్రం జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉంటా" అని పేర్కొన్నాడు.
ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ వార్నర్‌కు వందో టెస్ట్ మ్యాచ్. అలా తన వందో మ్యాచ్‌లో సెంచరీ బాది.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తమ వందో టెస్టులో శతకం బాదిన పదో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. దీని గురించి మాట్లాడుతూ.. "నా కోసం పరుగులు ఎదురుచూస్తున్నాయి. పెద్ద వేదికలపై అద్భుత ప్రదర్శన చేయగలిగే శక్తి నాలో ఉందని తెలుసు. నా వందో టెస్ట్ ఎమ్సీజీ లాంటి గొప్ప వేదికలో జరగడం గొప్పగా భావిస్తున్నాను. ఇకపోతే ఈ మ్యాచ్ విజయంలో ఆటగాళ్లంతా మంచి ప్రదర్శన చేశారు. కెమరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ సెంచరీ ఇలా అందరూ గొప్పగా ఆడారు." అని పేర్కొన్నాడు.