టీమ్ఇండియాకు బౌలింగ్ కోచ్‌గా ఉండేందుకు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్(Steyn News) ఆసక్తి కనబరిచాడు. ఓ క్రీడాఛానల్ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌కు స్టెయిన్ రిప్లై ఇచ్చిన తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
ధోనీకి మెసేజ్..
టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) నేపథ్యంలో టీమ్ఇండియాకు మెంటార్‌గా ధోనీని(Dhoni Mentor) నియమించింది బీసీసీఐ. ఈ క్రమంలో.. 'ధోనీతో ఫోన్ కాల్లో ఉంటే.. ఆయనకు మీరు ఏం చెబుతారు?' అని సదరు ఛానల్ ఓ పోస్ట్ పెట్టింది. దీనికి బదులిచ్చిన డేల్ స్టెయిన్. 'టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా నన్ను నియమించమని అడుగుతా' అని కామెంట్ చేశాడు.
స్టెయిన్ కామెంట్ చేసిన కొద్ది సేపటికే ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా అతడిని నియమిస్తే బాగుంటుందని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు టీమ్ఇండియా కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్(Dravid New Coach) చేపట్టనున్నాడని ఊహాగానాలు జోరందుకున్నాయి. పరాస్ మాంబ్రే(Paras Mhambrey cricket) బౌలింగ్ కోచ్ పదవి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై బీసీసీఐ ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. ఇక )భారత పురుషుల జట్టుకు కొత్త కోచింగ్ బృందం కోసం నేడు(అక్టోబర్ 1 దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ.
టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు రవిశాస్త్రి ఇటీవలే పేర్కొన్నాడు. మెగా టోర్నీ తర్వాత బౌలింగ్ కోచ్ బాధ్యతలు కొనసాగించనని భరత్ అరుణ్ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో కొత్త కోచింగ్ బృందం కోసం ప్రస్తుతం బోర్డు చర్చలు జరుపుతోంది.
ఇదీ చదవండి:
Dravid coach: టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్.. 2023 ప్రపంచకప్ వరకు