CSK New Captain Jadeja: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోనీ గురువారం గుడ్‌బై చెప్పాడు. సారథిగా బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. ఈ మేరకు తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశాడు జడేజా.
''చాలా సంతోషంగా ఉంది. ఇదే సమయంలో నాపై పెద్ద బాధ్యత కూడా పడింది. కెప్టెన్‌గా జట్టును నేను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ దీని గురించి నేను అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ధోనీ భయ్యా కెప్టెన్‌గా మాత్రమే తప్పుకున్నాడు. ఆటగాడిగా జట్టులోనే ఉంటాడు. ధోనీ భయ్యా సలహాలను నేను ఉపయోగించుకుంటాను. మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు'' అంటూ జడ్డూ పేర్కొన్నాడు.
-
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
లీగ్ ఆరంభం నుంచి సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. నాలుగుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఒక జట్టును ఎక్కువసార్లు ఫైనల్స్, ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా మహీ రికార్డు సృష్టించాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో సీఎస్కే టైటిల్ గెలిచింది. మార్చి 26న కోల్‌కతా-చెన్నై మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ..కొత్త సారథి అతడే