ETV Bharat / sports

దక్షిణాఫ్రికా టీ20 లీగ్​లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే

దక్షిణాఫ్రికా టీ20లీగ్​లో భారత్​ ఆటగాళ్లు భాగం కానున్నారా అనే విషయమై స్పందించారు ఓ బీసీసీఐ అధికారి. ఏం చెప్పారంటే.

dhoni
ధోనీ
author img

By

Published : Aug 13, 2022, 11:12 AM IST

Updated : Aug 13, 2022, 11:50 AM IST

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్​తో ముందుకు రానుంది. అయితే ఇది పేరుకే ప్రొటిస్​ లీగ్​ అయినా ఇందులో పాల్లొనబోయే ఆరు జట్లను ఐపీఎల్​ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇందులో జోహన్నెస్​బర్గ్​ జట్టును చెన్నై సూపర్​కింగ్స్​ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం ధోనీని తమ మెంటార్​గా నియమించనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ లీగ్​లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి.

అయితే ఈ విషయంపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత ఆటగాళ్లు ఎవరూ విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ఆడాలని కోరుకుంటే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్​ అయ్యాకే ఆడే ఛాన్స్‌ ఉంటుందని చెప్పారు.

"అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగేంత వరకు ఏ భారత క్రికెటర్‌ ఇతర లీగ్‌లలో ఆడకూడదు. ఎవరైనా రానున్న లీగ్‌లలో ఆడాలని కోరుకుంటే బీసీసీఐ పర్మిషన్​ లేదా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్​ ప్రకటించాకే అతడికి ఆ అవకాశం ఉంటుంది" అని సదరు అధికారి స్పష్టం చేశారు. కాగా, ఈ సౌతాఫ్రికా లీగ్​లో కేప్‌టౌన్‌ ఫ్రాంచైజీని ముంబయి ఇండియన్స్‌, జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌, డర్బన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌, పోర్ట్‌ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ప్రిటోరియాను దిల్లీ క్యాపిటల్స్‌, పర్ల్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకున్నాయి.

ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన తెలంగాణ రెజ్లర్​ నిఖిల్‌

Last Updated : Aug 13, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.