ETV Bharat / sports

IND Vs AUS: నిరాశపరిచిన టీమ్​ఇండియా 'నయావాల్​'.. 'వందో' టెస్టులో డకౌట్​!

దిల్లీ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పుజారా నిరాశపర్చాడు. తన కెరీర్​లో వందో టెస్టు ఆడుతున్న పుజారా.. ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్​ చేరాడు. దీంతో తమ వందో టెస్టులో డకౌట్​​ అయిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.

pujara duck in 100th test
pujara duck in 100th test
author img

By

Published : Feb 18, 2023, 12:56 PM IST

Updated : Feb 18, 2023, 3:08 PM IST

ప్రతిష్ఠాత్మక బోర్డర్​- గావస్కర్​ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య రెండో టస్టు జరుగుతోంది. అయితే, ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 21/0తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన టీమ్​ఇండియా కష్టాల్లో పడింది. భారత ఓపెనర్లు రోహిత్‌(32), రాహుల్‌(17) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరారు. సూర్య స్థానంలో వచ్చిన అయ్యర్‌ 4 పరుగులకే వెనుదిరిగాడు. వీరంతా లయోన్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి 35 ఓవర్లు ఆడిన భారత్‌ 88/4 స్కోర్ చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు భారత్‌.. ఇంకా 175 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జడేజా(15*), విరాట్‌ కోహ్లీ(14*) ఉన్నారు.

నిరాశపరిచిన పుజారా..
టీమ్​ఇండియా 'నయావాల్​' ఛెతేశ్వర్ పుజారా.. తన వందో మైలురాయి టెస్టులో నిరాశ పర్చాడు. 19.4 ఓవర్లో లయోన్​ వేసిన బౌలింగ్​లో.. బంతి పుజారా ప్యాడ్​కు తగిలింది. దీంతో లయోన్​ ఔట్​ అప్పీల్​ చేశాడు. కానీ, అంపైర్​ నితిన్​ మీనన్​ ఔట్​ ఇవ్వలేదు. దీంతో ఆసీస్​ జట్టు తన చివరి రివ్యూను కోరింది. అనంతరం థర్డ్​ అంపైర్​ పరిశీలించి.. బంతి బ్యాట్​ కన్నా ముందు ప్యాడ్​కు తగిలిందని నిర్ధరించి ఔట్​ ఇచ్చాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే పుజారా డకౌట్​ అయ్యాడు.

వందో టెస్ట్​లో డకౌట్​ అయిన జాబితాలోకి నయావాల్​..
​అయితే, ఇదివరకు కొంత మంది క్రికెటర్లు కూడా తమ వందో టెస్టులో డకౌట్​ అయ్యారు. అందులో మొదటగా దిలీప్​ వెంగ్​సర్కార్​ 1988లో న్యూజిలాండ్​తో జరిగిన టెస్టులో డకౌట్ అయ్యాడు. అలాన్​ బోర్డర్.. వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్​ చేరాడు. పదేళ్ల తర్వాత 1998లో సీ వాల్ష్​ ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో డక్​ అయ్యాడు. అలా ఎమ్​ టేలర్​, వీ కుక్​, ఫ్లెమింగ్​, బ్రెండన్ మెక్​కల్లమ్​ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

తొలి రోజు ఆట ముగిసేసరికి..
తొలి రోజు ఆట ముగిసేసరికి.. టీమ్‌ఇండియా వికెట్లు నష్టపోకుండా 25 పరుగులు చేసింది. మొదటి టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 263 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కష్టపడ్డప్పటికీ.. ఆసీస్​ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (81), పీటర్​ హ్యాండ్స్​కాంబ్​ (72) చెలరేగిపోయారు. ఆస్ట్రేలియా​ స్కోరు బోర్డును పరుగెత్తించారు. మరో ఆసీస్ బ్యాటర్​ కమిన్స్​ (33) ఫర్వాలేనిపించాడు. ఇక, భారత బౌలర్లలో.. మహ్మద్​ షమీ(4) వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు చొప్పున తీశారు.

Last Updated : Feb 18, 2023, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.