ETV Bharat / sports

'స్పైడర్ మ్యాన్​'కు శుభ్‌మన్‌ గిల్‌ డబ్బింగ్‌.. ట్రైలర్‌ చూశారా? - ఇండియన్ స్పైడర్ మ్యాన్​కు క్రికెటర్ గిల్ డబ్బింగ్

సినీ ప్రియులను అలరించేందుకు ఓ హాలీవుడ్‌ మూవీకి టీమ్​ఇండియా క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. డబ్బింగ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. అదే 'స్పైడర్ మ్యాన్ - ఎక్రాస్ ది స్పైడర్ వర్స్'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. మీరు చూశారా?

Spider man subhmann gill
'స్పైడర్ మ్యాన్​'కు శుభ్‌మన్‌ గిల్‌ డబ్బింగ్‌.. ట్రైలర్‌ చూశారా?
author img

By

Published : May 18, 2023, 6:28 PM IST

Updated : May 18, 2023, 7:10 PM IST

Indian Spider-Man Subhmann Gill : టీమ్​ఇండియా యువ బ్యాట్స్‌మెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అద్భుతమైన ఆటతీరుతో పరుగులు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇతడు రీసెంట్​గా కొత్త అవతారం ఎత్తాడు. తాజా ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొడుతున్న ఈ గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌.. సినిమా రంగంలోకి ఇటీవలే అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సిల్వర్​స్క్రీన్​పై కనిపించే నటుడిగా కాకుండా.. ఓ హాలీవుడ్‌ యానిమేషన్ చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇండియన్‌ స్పైడర్‌మ్యాన్‌ పాత్రకు గిల్‌ తన గాత్రాన్ని అందించాడు. ఆ సినిమా పేరే 'స్పైడర్ మ్యాన్ - ఎక్రాస్ ది స్పైడర్ వర్స్'. అయితే తాజాగా మూవీటీమ్​.. ముంబయిలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి.. భారతీయ భాషల్లో దానికి సంబంధించిన ట్రైలర్​ను రిలీజ్​ చేసింది. క్రికెటర్​ శుభమన్ గిల్‌ చేత విడుదల చేయించింది. అందులో అతడు పంజాబీ, హిందీ భాషలకు డబ్బింగ్ చెప్పాడు. హాలీవుడ్‌ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలోని ఓ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్న తొలి క్రీడాకారుడు శుభ్‌మన్‌ కావడం విశేషమనే చెప్పాలి.

గిల్​ స్పైడర్ మ్యాన్ పాత్రకు డబ్బింగ్​ చెప్పడం ఇటీవలే హర్షం వ్యక్తం చేశాడు. "స్పైడర్‌ మ్యాన్‌ ఎంతో మందికి తెలిసిన ఓ సూపర్‌ హీరో. ఈ సినిమాతో ఫస్ట్​టైమ్​ ఇండియన్‌ స్పైడర్‌మ్యాన్‌ను తెరపై చూపించబోతున్నారు. పవిత్ర్‌ ప్రభాకర్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం నా లైఫ్​లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ స్పెషల్ ఎక్స్​పీరియన్స్​. ఎంతో హ్యాపీగా ఉంది. ఈ సినిమా రిలీజ్​ కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్​ చేస్తున్నాను" అని గిల్​ సంతోషం వ్యక్తం చేశాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, 2018లో వచ్చిన 'స్పైడర్‌ మ్యాన్‌ : ఇన్‌టు ది స్పైడర్‌-వెర్స్‌' చిత్రానికి సీక్వెల్‌గా 'స్పైడర్‌ మ్యాన్‌: అక్రాస్‌ ది స్పైడర్‌-వెర్స్‌'ను రూపొందించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్.. భారత్‌లో ఈ సినిమాను సోనీ పిక్చర్‌ విడుదల చేస్తోంది. ఈ చిత్రంతో తొలిసారిగా భారత స్పైడర్‌ మ్యాన్‌ పవిత్ర ప్రభాకర్‌ను వెండితెరకు పరిచయం చేస్తోంది. జూన్‌ 1వ తేదీన ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌ సహా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ ఇలా 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జాక్విమ్​ డాస్​ సంతోశ్​, కెంప్​ పవర్స్​, జస్టిన్​ కె థాంసన్​ దర్శకత్వం వహించారు. ఫిల్​ లార్డ్​, క్రిస్టోఫర్​ మిల్లర్​, డేవిడ్ కలిసి స్క్రీన్​ ప్లే అందించారు.

ఇదీ చూడండి: RCB vs SRH : కీలక మ్యాచుల్లో 7 సార్లు సన్​రైజర్సే.. మరి ఆర్సీబీ ఈ సారైనా..

Last Updated : May 18, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.