టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన గ్యారేజ్‌లోని పాత కాలంనాటి ఓ కారులో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కాడు. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన నీలం రంగు కారును తనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ రాంచీ రోడ్డుపై తిప్పాడు. కాగా ఈ రైడ్‌లో తన కుమార్తె జీవాసింగ్ పక్క సీట్లో ఉండడం విశేషం. అయితే ఆ కారు 1980వ సంవత్సరానికి చెందినదిగా తెలుస్తోంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇటీవలే ధోనీ ఫ్యామిలీతో కలిసి విమానంలో ప్రయాణిస్తుండగా.. క్యాండీక్రష్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించాడు. ఆ వీడియో సైతం వైరలయ్యింది. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక.. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
-
MS Dhoni in Rolls Royce [1980]pic.twitter.com/XcbyEVTT7l
— Johns. (@CricCrazyJohns) July 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">MS Dhoni in Rolls Royce [1980]pic.twitter.com/XcbyEVTT7l
— Johns. (@CricCrazyJohns) July 26, 2023MS Dhoni in Rolls Royce [1980]pic.twitter.com/XcbyEVTT7l
— Johns. (@CricCrazyJohns) July 26, 2023
అయితే మహీకి కార్లన్నా, బైకులన్నా ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనం ఏదైనా, ఎంత ఖరీదైనా సరే.. తనకు నచ్చితే గ్యారేజ్‌లో ఉండాల్సిందే. ఈ మధ్య టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా ధోనీ గ్యారేజ్‌ను సందర్శించాడు. అక్కడున్న వెహికిల్ కలెక్షన్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. మహీ గ్యారేజ్‌లో ఉన్న బైక్‌లు, కార్ల గురించి ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. అయితే మహీ బైక్, కారుతో రోడ్ల మీద చక్కర్లు కొట్టడం కొత్తేమీ కాదు. కానీ తన కుమార్తె జీవాసింగ్ పక్కనే కుర్చోవడం ఈ వీడియోకు ప్రాధాన్యత సంతరించుకుంది. రోడ్డు పక్కనే వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు.
Dhoni Cricket Career : ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. దాదాపు 15 ఏళ్లపాటు సాగిన అతడి కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. చాలా కాలం టీమ్ఇండియాలో ఫినిషర్‌గా మారి ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. కాగా కెరీర్లో.. 44.9 సగటుతో మొత్తం 17,266 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 224 పరుగులు. అయితే 2023 ఐపీఎల్ ధోనీకి చివరిదని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపాడు.