ప్రపంచకప్.. మ్యాచ్‌లు సాదాసీదాగా జరిగితే కిక్కేముంటుంది. ఏదో వచ్చామా, కొట్టామా, వెళ్లామా అన్నట్టు కాకుండా థ్రిల్లింగ్‌గా సాగి తమ అభిమాన జట్టు గెలిస్తే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మరి ప్రపంచకప్‌లో అలా ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగి.. ఓడిపోవాల్సిన తరుణంలో గెలిచిన టాప్-5 మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం.
గిల్మౌర్ గ్రేట్ డే...
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1975 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఓ సెమీస్ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠంగా సాగింది. ఇందులో ఆసీస్ గెలిచింది. కంగారూ ఆటగాడు గ్యారీ గిల్మౌర్ బౌలింగ్‌తో (6/14) పాటు బ్యాటింగ్‌లోనూ (28) మెరిశాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 93 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు తడబడింది. 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్యారీ.. మరో కంగారూ బ్యాట్స్‌మెన్ డగ్ వాల్టర్ సాయంతో నిలకడగా ఆడి ఆసీస్‌ను ఫైనల్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు గ్యారీ.
తుదిపోరులో వెస్టిండీస్ విజయం సాధించింది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు (11)తో పాటు ఎక్కువ పరుగులు (333) చేసిన ఆటగాడిగా గ్యారీ గిల్మౌర్ రికార్డు సృష్టించాడు.
కపిల్‌దేవ్ మరపురాని ఇన్నింగ్స్..
1983 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ అద్భుత విజయం సాధించింది. కపిల్‌దేవ్ 175 పరుగులతో వీరోచితంగా పోరాడాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కపిల్ 138 బంతుల్లో 175 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
తర్వాత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 233 పరుగులకు ఆలౌటైంది. కపిల్‌దేవ్ విధ్వంసంతో జింబాబ్వేపై గెలిచిన భారత్ వారం తర్వాత ఫైనల్లో విండీస్‌ను ఓడించి తొలిసారి విశ్వవిజేతైంది.
1999లో ఆసీస్ అదృష్టం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1999 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య ఓ సెమీస్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 213 పరుగులకు ఆలౌటైంది. ప్రొటీస్ బౌలర్ షాన్ పోలక్ 36 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. 214 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికాలో జాక్వెస్ కలిస్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. విజయానికి 39 పరుగుల అవసరం. 5 వికెట్లు చేతిలో ఉన్నాయి.
ఇలాంటి సమయంలో రనౌట్లతో వికెట్లు సమర్పించుకుంది దక్షిణాఫ్రికా. క్లుజెనర్ 16 బంతుల్లో 31 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. మ్యాచ్ టైగా ముగిసింది. కానీ సూపర్ 6లో ఆస్ట్రేలియాతో ఓడిపోయిన సౌతాఫ్రికా నెట్ రన్‌రేట్‌లో వెనుకబడింది. ఈ కారణంగా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. తుదిపోరులో పాకిస్థాన్‌ను ఓడించి రెండోసారి వరల్డ్‌కప్ నెగ్గింది కంగారూ జట్టు.
పసికూనపై ఇంగ్లాండ్ ఓటమి..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2011 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో టెస్టు అర్హత కూడా లేని ఐర్లాండ్‌పై పరాజయం చెందింది ఇంగ్లాండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 327 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐరిష్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ (113) శతకంతో అదరగొట్టాడు.
111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను కెవిన్ ఆదుకున్నాడు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ మ్యాచ్‌లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు కెవిన్. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత్ రెండోసారి ప్రపంచకప్ సొంతం చేసుకుంది.
మరోసారి దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
1996, 1999 ప్రపంచకప్‌ల్లో దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా మరోసారి అదే పంథా కొనసాగించింది. 2015 వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై పరాజయం చెందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కివీస్ ఆల్‌రౌండర్ గ్రాంట్ ఎలైట్ సఫారీ జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. డివిలియర్స్, డుప్లెసిస్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. డక్‌వర్త్ లూయిస్ విధానం ద్వారా కివీస్ 43 ఓవర్లలో 298 పరుగులు చేయాల్సి ఉంది.
న్యూజిలాండ్ గెలవాలంటే చివరి రెండు బంతులకు 5 పరుగులు చేయాలి. డేల్ స్టెయిన్ బౌలింగ్. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ ఆల్‌రౌండర్ ఎలైట్ సిక్సర్ బాది జట్టును ఫైనల్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ ఎలైట్ (84) అర్ధశతకంతో అదరగొట్టాడు. ఆసీస్‌తో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ ఓడిపోయింది.