డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఆసీస్ అమ్మాయిలు.. ఆ తర్వాత శ్రీలంకపై నెగ్గారు. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
కాన్బెర్రా వేదికగా గురువారం జరిగిన గ్రూప్-ఎ పోరులో... ఆసీస్ జట్టు 86 పరుగలు తేడాతో బంగ్లాపై ఘనవిజయం సాధించింది. కంగారూ జట్టు బ్యాట్స్‌వుమన్ అలీసా హీలీ (83), బెత్ మూనీ (81 నాటౌట్) సత్తా చాటారు.
-
👉 Alyssa Healy 83 (53)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
👉 Beth Mooney 81* (58)
👉 Ash Gardner 22* (9)
What a performance from Australia!#AUSvBAN | #T20WorldCup
SCORE 📝 https://t.co/ZSMgugPHcl pic.twitter.com/pLsuLJhryy
">👉 Alyssa Healy 83 (53)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020
👉 Beth Mooney 81* (58)
👉 Ash Gardner 22* (9)
What a performance from Australia!#AUSvBAN | #T20WorldCup
SCORE 📝 https://t.co/ZSMgugPHcl pic.twitter.com/pLsuLJhryy👉 Alyssa Healy 83 (53)
— T20 World Cup (@T20WorldCup) February 27, 2020
👉 Beth Mooney 81* (58)
👉 Ash Gardner 22* (9)
What a performance from Australia!#AUSvBAN | #T20WorldCup
SCORE 📝 https://t.co/ZSMgugPHcl pic.twitter.com/pLsuLJhryy
మొదట ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు హీలీ, మూనీ తొలి వికెట్‌కు రికార్డు 151 పరుగులు జోడించారు. మెగాన్ షట్ (3/21), జెస్ జొనాసెన్ (2/17) ధాటికి.. ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. ఫర్జానా (36) టాప్ స్కోరర్‌గా నిలిచింది. హీలీకి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
'గ్రూప్-ఎ'లో ఇప్పటికే మహిళా టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి.