ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. అభిమానులకు నిరాశ మిగిల్చింది. కొందరు జట్టుకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. కోహ్లీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని అంటున్నారు పలువురు. ఆ స్థానంలో రోహిత్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతలు రోహిత్‌కు అప్పగించాలి కోరాడు. 2023 ప్రపంచకప్ జట్టుకు హిట్‌మ్యాన్ కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
-
Is it time to hand over white ball captaincy to Rohit Sharma?
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
I would like him to lead India in 2023 World Cup🏆
">Is it time to hand over white ball captaincy to Rohit Sharma?
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019
I would like him to lead India in 2023 World Cup🏆Is it time to hand over white ball captaincy to Rohit Sharma?
— Wasim Jaffer (@WasimJaffer14) July 12, 2019
I would like him to lead India in 2023 World Cup🏆
2023 ప్రపంచకప్ ఇండియాలో జరగబోతోంది. 2011లో భారత్‌లో జరిగిన వరల్డ్‌కప్‌ను టీమిండియా గెలుచుకుంది. అలాగే 2023లోనూ టోర్నీని గెలవాలని అందుకు జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 648 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఇవీ చూడండి.. ఇంగ్లాండ్ ప్రేక్షకులకు పండగే.. ఒకేరోజు మూడు ఫైనల్స్