ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్ ఆడకముందే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతో బాధపడుతున్న కోహ్లీకి ఫిజియో అతడి బొటనవేలిపై స్ప్రే చేసి ప్రథమ చికిత్స అందించాడు.
అయితే విరాట్‌కు బ్యాటింగ్ చేస్తున్నపుడు గాయమైందా.. లేదా ఫీల్డింగ్లోనా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రాక్టీస్ అనంతరం కోహ్లీ ఐస్ గ్లాస్లో వేలు ఉంచుకుని కనిపించాడు. ఈ అంశంపై బీసీసీఐ కానీ, జట్టు యాజమాన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరో మూడు రోజుల్లో తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న తరుణంలో కోహ్లీ గాయం వార్త సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తోంది. కెప్టెన్‌గా కోహ్లీకిదే తొలి ప్రపంచకప్.