సెమీస్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో పరజాయం చెంది ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది భారత్. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. 45 రోజుల శ్రమ 45 నిమిషాల్లో చేసిన తప్పిదం వల్ల వృథా అయిందని తెలిపాడు. కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు.
"240 పరుగుల స్కోరు ఏ మైదానంలోనైన ఛేదించ గల లక్ష్యమే. ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాం. అయితే కివీస్ బౌలర్లు కొత్త బంతితో చక్కగా స్వింగ్ చేసి వికెట్ల తీశారు. 45 రోజుల శ్రమ 45 నిమిషాల్లో చేసిన తప్పిదం వల్ల వృథా అయింది. ఈ ఓటమిని అంగీకరించడం కొంచెం కష్టమే" - విరాట్ కోహ్లీ భారత్ కెప్టెన్.
జడేజా అద్భుతంగా ఆడాడని తెలిపాడు కోహ్లీ. ధోనితో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పాడు. మహీ రనౌట్ కాకుంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు విరాట్.
న్యూజిలాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది టీమిండియా.
ఇది చదవండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్ వృథా... ఫైనల్లో కివీస్