ETV Bharat / sports

'రాయుడు ఆ ట్వీట్.. నా గురించి చేయలేదు' - 3డీ

అంబటి రాయుడు త్రీడీ ట్వీట్​పై భారత క్రికెటర్ విజయ్​శంకర్ స్పందించాడు. ఆ ట్వీట్ రాయుడు తన గురించి చేయలేదని ఓ టీవి షో ముఖాముఖిలో తెలిపాడు.

విజయ్ శంకర్
author img

By

Published : May 25, 2019, 5:18 PM IST

ప్రపంచకప్​ జట్టులో ఎంపిక కాకపోవడం వల్ల అంబటి రాయుడు చేసిన 3డీ ట్వీట్​ కొద్ది రోజుల క్రితం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై విజయ్​శంకర్ స్పందించాడు. రాయుడు ఈ ట్వీట్ తనను ఉద్దేశించి చేసింది కాదన్నాడు.

ఓ క్రికెటర్​గా రాయుడు పరిస్థితి అర్థం చేసుకుంటానని, జట్టులోకి ఎంపికకాకపోతే సదరు ఆటగాడు ఎంత బాధపడతాడో తనకు తెలుసని రాయుడుకు మద్దతుగా మాట్లాడాడు విజయ్​ శంకర్​. రాయుడు చేసిన ట్వీట్ తన గురించి కాదని ఓ టీవి షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

గత నెలలో ప్రపంచకప్​ జట్టుకు 15 మందిని ఎంపికచేశారు సెలెక్టర్లు. అంబటి రాయుడు స్థానంలో విజయ్​శంకర్​కు అవకాశమిచ్చారు. విజయశంకర్​ త్రి డైమెన్షనల్ ఆటగాడని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లతో మూడు రకాలుగా ఉపయోగపడతాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ అంశంపై స్పందించిన రాయుడు తాను త్రీడీ కళ్లద్దాలు ఆర్డరిచ్చానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్​తో విజయ్​శంకర్​కు రాయుడు పరోక్షంగా సెటైర్ వేశాడని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఇద్దరు ఆటగాళ్లు అప్పుడు స్పందించలేదు.

ఇది చదవండి:ప్రాక్టీస్​ మ్యాచ్​లో భారత్​ టాప్​ ఆర్డర్​ విఫలం

New Delhi, May 25 (ANI): While speaking to ANI, Bharatiya Janata Party (BJP) spokesperson Shahnawaz Hussain spoke about the BJP-NDA meeting that is going to be held on Saturday. Hussain said, "Today a meeting is going to happen among BJP's newly-elected MPs and MLA's to elect PM Modi as our leader once again, to make him the Prime Minister of country once again. There is a wave of happiness in the country. This is the very first that we can see such kind of atmosphere in the country that the whole nation feels that they found someone. We hope that the dreams seen by the nation will be fulfilled by Narendra Modi."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.