ETV Bharat / sports

టీ20-ప్రపంచకప్​ భారత్​లో జరిగేనా?

భారత్​లో విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులు కారణంగా అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్​ విజృంభణ కారణంగా టీ20 ప్రపంచకప్​ నిర్వహించడం కష్టమనే కొందరు క్రికెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదిక గురించి చర్చ జరుగుతోంది.

UAE on standby as venue for ICC T20 World Cup 2021
భారత్​లో టీ20 ప్రపంచకప్​ నిర్వహణ డౌటే!
author img

By

Published : Apr 27, 2021, 2:35 PM IST

కరోనా సంక్షోభంలోనూ ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)ను కొనసాగిస్తామని భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు క్రికెట్​ ఆడేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటికే టీమ్ఇండియా స్పిన్నర్​ అశ్విన్​తో పాటు ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. అయితే టీ20 ప్రపంచకప్​ ప్రారంభానికి భారత్​లో ఇదే పరిస్థితి కొనసాగితే.. టోర్నీ వేదికను మార్చే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.

క్రికెటర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. అక్టోబరు నాటికి భారత్​లో కరోనా కేసులు నియంత్రణలో రాకపోతే టీ20 ప్రపంచకప్​ను యూఏఈలో నిర్వహించే వేదికగా ఎంపికచేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ టోర్నీ తరలించాల్సి వస్తే బీసీసీఐ మొదటి ఎంపిక యూఏఈ అవుతుందని పలువురు క్రికెట్​ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి.. 'వచ్చే వారంలో క్రికెటర్లకు వాక్సిన్​!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.