మరి కాసేపట్లో 12వ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆరంభం కాబోతుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్‌కప్‌ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరు జట్లు. అయితే ఈ రెండు జట్లలో టాప్-5 ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
It's here!
— ICC (@ICC) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Day 1️⃣
🏟️ The Oval
🏴 v 🇿🇦 #CWC19 #ENGvSA pic.twitter.com/QZGKVh1l3S
">It's here!
— ICC (@ICC) May 30, 2019
Day 1️⃣
🏟️ The Oval
🏴 v 🇿🇦 #CWC19 #ENGvSA pic.twitter.com/QZGKVh1l3SIt's here!
— ICC (@ICC) May 30, 2019
Day 1️⃣
🏟️ The Oval
🏴 v 🇿🇦 #CWC19 #ENGvSA pic.twitter.com/QZGKVh1l3S
జానీ బెయిర్ స్టో..
ఐపీఎల్లో హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించిన బెయిర్ స్టో 10 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేశాడు. ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాడీ ఓపెనర్. ఐపీఎల్లో బెంగళూరుపై 52 బంతుల్లోనే సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లోనూ తన హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు.
జాస్ బట్లర్...
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన బట్లర్ తన హిట్టింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించగలడు. ఇంగ్లీషు జట్టుకు మిడిల్ ఆర్డర్లో బట్లరే కీలకం కానున్నాడు. టాప్ ఆర్డర్ విఫలైమన ఎన్నో సార్లు తన బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్‌పై సత్తాచాటిన బట్లర్ ప్రస్తుతం ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.
జోఫ్రా ఆర్చర్...
ప్రపంచకప్ జట్టులో మొదట చోటు దక్కించుకోని ఆర్చర్... తన నిలకడైన ఆట తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ సత్తాచాటిన ఈ 24 ఏళ్ల కుడిచేతి వాటం బౌలర్... ఇంగ్లీషు జట్టు బౌలింగ్ విభాగంలో ప్రధాన అస్త్రం. ఈ ఐపీఎల్ సీజన్లో 11 వికెట్లతో రాణించాడు.
క్వింటన్ డికాక్...
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో 500కి పైగా పరుగులు చేసి ప్రొటీస్ టాప్ ఆర్డ్ర్లో బలం చేకూర్చనున్నాడు. పరిస్థితుల బట్టి నిలకడగా ఆడుతూ.. హిట్టింగ్ చేయగల సామార్థ్యమున్న బ్యాట్స్‌మన్. వన్డేల్లో 45కి పైగా సగటుతో సౌతాఫ్రికాలో కీలక ఆటగాడిగా మారాడు.
కగిసొ రబాడా...
దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో ప్రధాన అస్త్రం రబాడా. ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడా 25 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు. ఇరువైపుల స్వింగ్ చేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. డెత్ ఓవర్లలో యార్కర్లతో పరుగుల కట్టడి చేయగల స్కిల్ ఉన్న బౌలర్. ప్రస్తుతం ప్రొటీస్‌కు బౌలింగ్‌లో కీలకం కానున్నాడు.
ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే అందరి దృష్టి ఉంది. మోర్గాన్ సారథ్యంలో ప్రపంచకప్ ఆడుతున్న ఇంగ్లాండ్ వన్డేల్లో మొదటి స్థానంలో ఉంది. డూప్లెసెస్ సారథ్యంలో బరిలో దిగుతున్న దక్షిణాఫ్రికా జట్టు మూడో ర్యాంకులో కొనసాగుతుంది.
జట్ల అంచనా..
ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టో, జాస్ బట్లర్(కీపర్), టామ్ కరన్, లియామ్ డాసన్, ప్లంకెట్, అదిల్ రషీద్, జోయ్ రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్
దక్షిణాఫ్రికా..
ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), మార్కామ్, డికాక్(కీపర్), ఆమ్లా, డుసెన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఆండిలే, డుమిని, ప్రిటోరియస్, డేల్ స్టేయిన్, కగిసో రబాడా, ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, తాబ్రేజ్, షమ్సీ.