శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ప్రపంచకప్ టోర్నీల్లో 600కు పైగా పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. మొత్తంగా చూసుకుంటే 600 పైచిలుకు చేసిన బ్యాట్స్మెన్ల్లో మూడోస్థానంలో ఉన్నాడు. రోహిత్(618) కంటే ముందు సచిన్(673), మాథ్యూ హెడెన్(659) ఉన్నారు.
2003 ప్రపంచకప్లో 673 పరుగులు చేసిన సచిన్ రికార్డు అధిగమించేందుకు మరో పరుగుల దూరంలో ఉన్నాడు రోహిత్. ఇప్పటికే ఈ ప్రపంచకప్లో నాలుగు శతకాలతో దూసుకెళ్లిన హిట్మ్యాన్ సచిన్ రికార్డును బద్దలు కొట్టే దిశగా ముందుకెళ్తున్నాడు.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగతున్న మ్యాచ్లో అర్ధశతకం చేసిన రోహిత్(75) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.