టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మ మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ గేమ్‌లో 3 సిక్సులు బాదిన హిట్‌మ్యాన్ ధోనీ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన క్రికెటర్‌గా ధోని (355) పేరిట రికార్డు ఉండేది. తాజాగా పాక్‌తో మ్యాచ్‌లో 3 సిక్స్‌లు కొట్టిన హిట్‌మ్యాన్ (358) మహీ రికార్డును అధిగమించాడు.
-
The Hitman show in Old Trafford - Put your hands up for @ImRo45 🙌🙌 #TeamIndia #CWC19 #INDvsPAK pic.twitter.com/H7nMpYZleP
— BCCI (@BCCI) June 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Hitman show in Old Trafford - Put your hands up for @ImRo45 🙌🙌 #TeamIndia #CWC19 #INDvsPAK pic.twitter.com/H7nMpYZleP
— BCCI (@BCCI) June 16, 2019The Hitman show in Old Trafford - Put your hands up for @ImRo45 🙌🙌 #TeamIndia #CWC19 #INDvsPAK pic.twitter.com/H7nMpYZleP
— BCCI (@BCCI) June 16, 2019
సిక్సర్ల వీరుల జాబితాలో భారత బ్యాట్స్మెన్లు సచిన్ తెందుల్కర్ (264), యువరాజ్ సింగ్ (251), సౌరవ్ గంగూలీ (247), వీరేంద్ర సెహ్వాగ్ (243) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్‌లోనే కెరీర్ 24వ శతకం అందుకున్నాడు రోహిత్. ప్రపంచకప్‌లో రోహిత్‌కు ఇది మూడో శతకం. మొదటిది 2015 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సాధించగా, మిగతా రెండు శతకాలు (దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై) ఈ ప్రపంచకప్‌లోనే అందుకున్నాడు.