ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా అప్రతిహతంగా జైత్రయాత్ర కొనసాగిస్తోంది న్యూజిలాండ్. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మినహా మిగతా జట్లపై పరాభవం మూటగట్టుకుంది పాకిస్థాన్. నేడు ఈ రెండింటి మధ్య బర్మింగ్‌హామ్ వేదికగా మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ జరగనుంది.
-
"I think they're very dangerous, and they've come off a pretty good win against South Africa."
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Mitchell Santner says New Zealand will not take Pakistan lightly 👇 pic.twitter.com/p1ivDEQIUr
">"I think they're very dangerous, and they've come off a pretty good win against South Africa."
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
Mitchell Santner says New Zealand will not take Pakistan lightly 👇 pic.twitter.com/p1ivDEQIUr"I think they're very dangerous, and they've come off a pretty good win against South Africa."
— Cricket World Cup (@cricketworldcup) June 25, 2019
Mitchell Santner says New Zealand will not take Pakistan lightly 👇 pic.twitter.com/p1ivDEQIUr
సెమీస్‌పై కన్నేసిన కివీస్
2019 మెగాటోర్నీలో నిలకడగా ఆడుతూ వరుస విజయాలు సొంతం చేసుకుంటోంది కివీస్ జట్టు. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిలో గెలవగా.. భారత్‌తో జరగాల్సి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో చివర్లో అద్భుతమే చేసి విజయం సాధించింది. 291 లక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్‌ను 286 పరగులకు ఆలౌట్ చేసింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 373 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో రాస్ టేలర్ కూడా చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది.
గప్తిల్, మున్రో, లాథమ్ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్‌లో బలంగా ఉంది కివీస్. బౌలింగ్ విషయానికొస్తే బౌల్ట్, ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ నిలకడగా రాణిస్తున్నారు. ఫెర్గ్యూసన్ 5 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌లో గెలిచి సెమీస్ స్థానాన్ని ఖరారు చేసుకోవాలనుకుంటోంది కివీస్.
నిలవాలంటే గెలవాల్సిందే..
ఆడిన ఆరు మ్యాచుల్లో రెండింటిలో మాత్రమే నెగ్గిన పాకిస్థాన్ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. కివీస్‌తో జరిగే ఈ మ్యాచ్ పాక్‌కు ఎంతో కీలకం కానుంది. ఇందులో గెలిస్తే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేకపోతే కష్టమే.
చిరకాల ప్రత్యర్థి భారత్‌పై ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న పాకిస్థాన్ గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. హారిస్ సోహైల్(89), బాబర్ అజామ్(69) విజృంభణతో 308 పరుగులు చేసింది. అనంతరం సఫారీలను 259 పరుగులకే కట్టడి చేసి 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్‌లో బాబర్ అజామ్, సోహైల్, హఫీజ్ నిలకడగా ఆడుతున్నారు. బౌలింగ్‌లో మహ్మద్ ఆమిర్ ఆకట్టుకుంటున్నాడు. 5 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు. వహాబ్ రియాజ్, షాదాబ్ ఖాన్ మంచి ప్రదర్శన చేస్తున్నారు.
అయితే జట్టు సమష్టిగా రాణించడంలో విఫలమౌతోంది. ఈ ప్రపంచకప్‌లో తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే విండీస్ చేతిలో 105 పరుగులకే ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియాపైనా ఓటమి చవిచూసింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ విభాగాల్లో విఫలమైంది.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు తలపడ్డాయి. ఆరు సార్లు పాకిస్థాన్ గెలవగా.. కివీస్ రెండు సార్లు మాత్రమే నెగ్గింది.
ఇది చదవండి: ఇంగ్లాండ్‌కు కంగారూ దెబ్బ..